కమల్ హాసన్ భార్య సారికహాసన్ ఉండడానికి ఇల్లు లేక నడి రోడ్డు మీద అనాథలా మిగిలిపోయిన దీన స్థితి చూడండి అంటూ పెట్టిన ఒక ఫేస్బుక్ పోస్ట్ ని చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో ఓసారి చూద్దాం.
క్లెయిమ్ (దావా): ఫొటోలో పైన నల్ల రంగు దుప్పటి వేసుకుని ఏడుస్తూ కనిపిస్తున్న మహిళ కమల్ హాసన్ భార్య సారిక హాసన్.
ఫాక్ట్ (నిజం): ఒక ఫోటో లోని సారిక ముఖ భాగం, ఇంకొక ఫోటోలోని వేరే మహిళ యొక్క ఇతర శరీర భాగానికి జోడించి పోస్ట్ లో పెట్టిన ఇమేజ్ ని సృష్టించారు. కావున పోస్ట్ లో పెట్టిన ఫోటో ఫోటోషాప్ చేయబడింది.
పోస్టులో పెట్టిన ఫోటోలో పైన కనిపిస్తున్న మహిళ యొక్క ముఖ భాగం క్రాప్ చేసి వెతికినప్పుడు, సారిక హాసన్ యొక్క ఒరిజినల్ ఫోటో లభించింది. అది ఆమె నటించిన బాలీవుడ్ చిత్రం ‘పర్జానియ’ లోనిది. ఈ ఫోటో లోని సారిక ముఖ భాగాన్ని, ఇంకొక ఫోటోలోని వేరే మహిళ యొక్క ఇతర శరీర భాగానికి జోడించి పోస్ట్ లో పెట్టిన ఇమేజ్ ని సృష్టించారు. ఇలా చేసిన ఇమేజ్ ని ఉపయోగించి అనేక అవాస్తవ కథనాలతో సోషల్ మీడియా లో వ్యాప్తి చేస్తున్నారు.
చివరగా, పోస్ట్ లో సారిక హాసన్ ఏడుస్తూ కన్పిస్తున్న ఫోటో, ఎడిట్ చేయబడిన ఫోటో.