కాంగ్రెస్ ప్రభుత్వం లో ఉన్నప్పుడే నిరవ్ మోడీ మోసాల గురించి కాంగ్రెస్ నాయకులని హెచ్చహిరంచాడని మాజీ ఆర్.బీ.ఐ గవర్నర్ రఘురాం రాజన్ అన్నట్లుగా ఫేస్బుక్ లో ఒక ఫోటో ని చాలా మంది ఈ మధ్య మల్లి షేర్ చేసారు. రఘురాం రాజన్ నిజంగా అలా అన్నారో లేదో చూద్దాం.
ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
క్లెయిమ్ (దావా): రఘురాం రాజన్: “ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే రాహుల్ గాంధీ మరియు చిదంబరం కి నిరవ్ మోడీ యొక్క మోసాల గురించి హెచ్చరించాను. కానీ వాళ్ళు 2014 వరకు నన్ను మాట్లాడకుండా చేసి రుణాలు ఇప్పించారు. ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ లో నన్ను ఎందుకు నిందిస్తున్నారు?”
ఫాక్ట్ (నిజం): తను అలాంటి వాఖ్యాలు చేయలేదని స్వయంగా రఘురాం రాజన్ గారే చెప్పారు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.
గూగుల్ లో ఈ విషయం మీద వెతకగా రఘురాం రాజన్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తను అలాంటి వాఖ్యాలు చేయలేదని, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా తనకు ఏవేవో అంటగడుతారని అన్నట్టుగా తెలుస్తుంది. ఈ పోస్ట్ గత సంవత్సరం మార్చ్ నెల నుండి షేర్ చేయబడుతుంది. అప్పట్లోనే Boom Live సంస్థ వారు ఈ విషయం పై నిజనిర్ధారణ చేసారు. కానీ ఎన్నికలు వస్తున్నందున తిరిగి ఫేస్బుక్ లో కొంత మంది ఈ పోస్ట్ ని షేర్ చేస్తున్నారు.
చివరగా, రఘురాం రాజన్ పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ గురించి రాహుల్ మరియు చిదంబరం ని హెచ్చరించలేదు.