Fake News, Telugu
 

ఫోటో లో ఉన్నది ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోదరుడు కాదు.

0

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోదరుడు ఒక టీ షాపుకు యజమాని అంటూ ఒక ఫోటోని చాలా మంది ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ఫోటో లో ఉన్నది ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోదరుడు. అతను ఒక టీ షాపుకు యజమాని.

ఫాక్ట్ (నిజం): యోగి ఆదిత్యనాథ్ కి ముగ్గురు సోదరులు. ఫోటోలో ఉన్నది ఆ ముగ్గురులోని ఒక వ్యక్తి కాదు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

గూగుల్ లో ‘Yogi Aditynath Brothers’ అని సెర్చ్ చేస్తే తనకు ముగ్గురు సోదరులు అని తెలుస్తుంది. వారి పేర్లు మన్వేంద్ర, శైలేంద్ర మరియు మహేంద్ర. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన సమయంలో వివిధ చానల్స్ వారి కుటుంబ సభ్యులను ఇంటర్వ్యూ చేసారు. ఆ వీడియోల్లో (ఎన్.డి.టి.వీ మరియు ఏ.బీ.పీ చానల్స్) యోగి సోదరులైన మన్వేంద్ర మరియు మహేంద్ర ను చూడవచ్చు. అలాగే 2017 సంవత్సరంలో ఇండియా టుడే వారు యోగి సోదరుడైన శైలేంద్ర ను ఇంటర్వ్యూ చేసారు. ఈ ముగ్గురుని ఫోటోలోని వ్యక్తితో పోలిస్తే ఫోటో లో ఉన్నది యోగి సోదరుడు కాదని తెలుస్తుంది.చివరగా, ఫోటో లో ఉన్నది ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోదరుడు కాదు.

Share.

About Author

Comments are closed.

scroll