పశ్చిమ బెంగాల్ లో అక్రమంగా నివాసం ఉంటున్న రోహింగ్యా కుటుంబం అని ఒక ఫోటోతో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ (దావా): పశ్చిమ బెంగాల్ లో అక్రమంగా నివాసం ఉంటున్న రోహింగ్యా కుటుంబం (మొగుడు-01, భార్యలు-02, పిల్లలు-18).
ఫాక్ట్ (నిజం): ఫోటో లోని కుటుంబం పశ్చిమ బెంగాల్ లో నివాసం ఉంటున్న రోహింగ్యా కుటుంబం కాదు, ఉత్తరప్రదేశ్ లోని ఒక ఊరిలో ప్రభుత్వం నుండి వచ్చే ఇళ్ళు కోసం ఎదురుచూస్తూ ఒకే గుడిసెలో నివసిస్తున్న 38 మంది ఉన్న ఒక కుటుంబం.
పోస్ట్ లోని ఫోటోని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, సెర్చ్ రిజల్ట్స్ లో పోస్ట్ లోని ఫోటోతో ఉన్న ఒక పోస్టర్ వస్తుంది. ఆ పోస్టర్ మీద ‘The Print’ అని వార్తా సంస్థ పేరు మరియు ‘एक झोपड़ी में रहते हैं 38 लोग, सरकारी योजना के तहत घर न मिलने से नाराज’ (ఒక గుడిసెలో 38 మంది ఉంటారు, ప్రభుత్వం ఇచ్చే ఇళ్ళు రావట్లేదని నిరాశగా ఉన్నారు) అని రాసి ఉంటుంది.
ఆ పోస్టర్ తో ఒక యూట్యూబ్ లింక్ కూడా ఉంటుంది. అది ‘The Print’ వారు ఎన్నికల సమయంలో ఫోటో లో ఉన్న కుటుంబం తో మాట్లాడిన వీడియో. ఫోటోలోని కుటుంబం ఉత్తరప్రదేశ్ లోని ఒక ఊరికి చెందినవారని, ప్రభుత్వం ఇచ్చే ఇళ్ళు కోసం ఎదురుచూస్తూ ఒకే గుడిసెలో 38 మంది నివసిస్తున్నారని వీడియో లో ఉంటుంది. ఫోటోలోని వారు రోహింగ్యాలు అని, ఒకే అతనికి 18 పిల్లలు అని వీడియోలో ఎక్కడా కూడా చెప్పరు.
అంతేకాదు, ఇదే వీడియోని ‘The Print’ వ్యవస్థాపకుడు శేకర్ గుప్తా తన ట్విట్టర్ అకౌంట్ లో కూడా పోస్ట్ చేసినట్టు చూడవచ్చు.
एक झोपड़ी में रहते हैं 38 लोग, सरकारी योजना के तहत घर न मिलने से नाराज#PollPosition
— Shekhar Gupta (@ShekharGupta) May 11, 2019
यूपी का एक ऐसा परिवार जिसे है पीएम मोदी से उम्मीद, @ThePrintHindi के संवाददाता प्रशांत श्रीवास्तव @Prashantps100 की ग्राउंड रिपोर्टhttps://t.co/ZqmAIKSQ53
చివరగా, ఫోటోలో ఉన్నది పశ్చిమ బెంగాల్ లో అక్రమంగా నివాసం ఉంటున్న రోహింగ్యా కుటుంబం కాదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?