Fake News, Telugu
 

పోస్ట్ లో చెప్పినట్టుగా పామును భుజాన వేసుకొని ఉన్నది యోగీ ఆదిత్యనాథ్ కాదు

0

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ‘ప్రకృతిని సైతం తన వోడికి చేర్చుకునడు’ అని చెప్తూ కొన్ని ఫోటోలను ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ ఫోటోల్లో యోగీ ఆదిత్యనాథ్ ఒక పామును తన భుజాల మీద తీసుకుని వెళ్తునట్టు కూడా ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): తన భుజాల మీద పామును ఎత్తుకు వెళ్తున్న యోగీ ఆదిత్యనాథ్.

ఫాక్ట్ (నిజం): ఫోటోలో ఉన్నది యోగీ ఆదిత్యనాథ్ కాదు, థాయిలాండ్ దేశానికి చెందిన ఒక
యోగీ . కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

ఈ ఫోటో ఫేస్బుక్ లోనే కాదు యూట్యూబ్ లో కూడా వివిధ వీడియోల్లో యోగీ ఆదిత్యనాథ్ అని ఉంది.


పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే, ఒక ఫోటోగ్రాఫర్ యొక్క ఫ్లికర్ అకౌంట్ లింక్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ ఫ్లికర్ అకౌంట్ లో పోస్ట్ లోని ఉన్న ఫోటోనే ఉంటుంది, కానీ వివరణ చూస్తే అది థాయిలాండ్ లో ఒక యోగీ ఫోటో అని తెలుస్తుంది. అంతే కాదు, ఆ సన్యాసి ముఖం కనిపించేలా ఇంకో ఫోటో కూడా ఆ ఫోటోగ్రాఫర్ అకౌంట్ లో ఉంటుంది.

చివరగా, పోస్ట్ లో చెప్పినట్టుగా పామును భుజాన వేసుకొని ఉన్నది యోగీ ఆదిత్యనాథ్ కాదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?


Share.

About Author

Comments are closed.

scroll