Fake News, Telugu
 

పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ‘మాకు కాశ్మీర్ వద్దు, కోహ్లిని ఇవ్వండి’ అని అడగలేదు

2

పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు తమకు కాశ్మీర్ వద్దని, క్రికెటర్ కోహ్లి ని ఇస్తే చాలు అని అడుగుతున్నట్టుగా ఉన్న ఫోటోని ఫేస్బుక్ లో చాలామంది షేర్ చేస్తున్నారు. ఆ ఫోటోలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): తమకు కాశ్మీర్ వద్దని, కోహ్లిని ఇవ్వమని అడుగుతున్న పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో ఉన్న ఫోటో ఫోటోషాప్ చేయబడింది. “We want Azaadi” అని కాశ్మీర్ ప్రజలు పట్టుకొన్న బ్యానర్ ఫోటోని తీసుకొని “We don’t want Kashmir. Give us Virat Kohli” అని ఫోటోషాప్ చేసి, పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు అడుగుతున్నట్టు తప్పుగా ప్రచారం చేస్తున్నారు.


పోస్ట్ లోని ఫోటోని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ లో వెతకగా, ఇండియా టుడే ఆర్టికల్ ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ ఆర్టికల్ లో పోస్ట్ లోని ఫోటో ఉంటుంది, కానీ ప్రజలు పట్టుకున్న బ్యానర్ మీద “We don’t want Kashmir. Give us Virat Kohli” (“మాకు కాశ్మీర్ వద్దు, కోహ్లిని ఇవ్వండి”) అని ఉండదు. బ్యానర్ మీద “We want Azaadi” (“మాకు ఆజాదీ కావాలి”) అని రాసి ఉంటుంది. కాబట్టి పోస్ట్ లోని ఫోటో ఫోటోషాప్ చేయబడింది. అంతే కాదు, ఇండియా టుడే ఆర్టికల్ చదువుతే, ఫోటోలో బ్యానర్ పట్టుకుంది కాశ్మీర్ ప్రజలని తెలుస్తుంది. కావున పోస్ట్ లో చెప్పినట్టుగా బ్యానర్ ని పట్టుకుంది పాకిస్తాన్ ప్రజలు కాదు.

చివరగా, కాశ్మీర్ ప్రజలు ‘ఆజాదీ కావాలి’ అని అడుగుతున్న ఫోటోని ఫోటోషాప్ చేసి పాకిస్తాన్ ప్రజలు ‘కోహ్లిని ఇవ్వండి’ అని అడుగుతున్నట్టు తప్పుగా ప్రచరం చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?


Share.

About Author

scroll