Fake News, Telugu
 

పాత వీడియో తీసుకొని ఫోని తుఫాను భీభత్సం అంటూ తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

0

ఒడిషా లో ఫోని తుఫాను భీభత్సం సృష్టిస్తుంది అంటూ ఒక వీడియోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ఒడిషాలో ఫోని తుఫాను సృష్టిస్తున్న భీభత్సంలో చిక్కుకున్న బస్సు.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ చేసిన వీడియో చాలా పాతది. రెండేళ్ళ క్రితమే చెన్నై లో జరిగినట్టుగా కొందరు ఇదే వీడియోని యుట్యూబ్ లో పోస్ట్ చేసారు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

పోస్ట్ లో ఉన్న వీడియో కోసం యుట్యూబ్ లో “Bus in Cyclone” అని వెతికితే, సెర్చ్ రిజల్ట్స్ లో అదే వీడియో దొరుకుతుంది. ఆ వీడియో టైటిల్ చూస్తే చెన్నై లో వార్ధ తుఫాను వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగినట్టుగా ఉంటుంది. ఆ వీడియోని రెండేళ్ళ క్రితమే యుట్యూబ్ లో అప్లోడ్ చేసారు. కావున అది ఒడిషాలో ఫోని తుఫాను వచ్చినప్పుడు తీసిన వీడియో కాదు.

చివరగా, పాత వీడియో తీసుకొని ఫోని తుఫాను భీభత్సం అంటూ తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll