హైదరాబాద్ అత్తాపూర్ లోని డీ-మార్ట్ లో బాంబ్ పెడుతూ తీవ్రవాది దొరికాడు అని ఫేస్బుక్ లో చాలా మంది ఒక వీడియోని షేర్ చేస్తున్నారు. ఆ వీడియో లో ఒక వ్యక్తికి ముసుగు వేసి పోలీసులు తీసుకొని వెళ్తున్నారు. వైరల్ అవుతున్న ఆ వీడియో లో నిజం ఎంత ఉందో విశ్లేషిద్దాం.
క్లెయిమ్ (దావా): అత్తాపూర్ హైదరాబాద్ D Mart లో బాంబ్ పెడ్తు దొరికిపోయిన తీవ్రవాది.
ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో చెప్పినట్టుగా అది తీవ్రవాది అరెస్ట్ కాదు. ముంబై లోని విరార్ ప్రాంతంలో ఉన్న డీ-మార్ట్ సూపర్ మార్కెట్ లో పోలీసులు నిర్వహించిన మోక్ కౌంటర్-టెర్రరిస్ట్ డ్రిల్ మాత్రమే. టైమ్స్ అఫ్ ఇండియా ఆర్టికల్ ప్రకారం డ్రిల్ లో ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ మరియు ఇరవై ఐదు మంది ఇతర స్టాఫ్ పాల్గొన్నారు. టెర్రరిస్ట్ దాడులు జరిగితే ఆ సమయంలో పోలిసు వారి స్పందన ఎలా ఉంటుందో చూడడం కోసం మాత్రమే ఆ డ్రిల్ నిర్వహించారు.
చివరగా, వైరల్ అవుతున్న ఆ వీడియోలో చూపెడుతుంది ఒక మాక్ డ్రిల్ మాత్రమే. చాలా మంది షేర్ చేస్తున్నట్టుగా అది నిజమైన తీవ్రవాది యొక్క అరెస్ట్ కాదు. తెలంగాణ లోని శంషాబాద్ జోన్ DCP కూడా ఈ విషయం మీద స్పష్టత ఇచ్చారు. అసలు ఆ వీడియో హైదరాబాద్ కి సంబంధించింది కాదని, ముంబై లో ఒక మాక్ డ్రిల్ వీడియో అని ప్రెస్ నోట్ లో చెప్పారు