Fake News, Telugu
 

శ్రీ రెడ్డికి జనసేన టికెట్ ఇవ్వలేదు. పోస్ట్ చేసిన ప్రెస్ రిలీజ్ ఫోటోషాప్ చేయబడింది.

0

శ్రీ రెడ్డికి జనసేన పార్టీ ఎం.పీ టికెట్ ఇచ్చిందంటూ జనసేన పార్టీ ప్రెస్ రిలీజ్ ఒకటి ఫేస్బుక్ లో కొందరు షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా):నంద్యాల లోక్ సభ స్థానం నుండి జనసేన అభ్యర్థిగా శ్రీ రెడ్డి పేరుని ఖరారు చేశారు.

ఫాక్ట్ (నిజం):నంద్యాల లోక్ సభ స్థానం నుండి జనసేన అభ్యర్థిగా ఎస్.పి.వై. రెడ్డి ని ఖరారు చేశారు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

జనసేన పార్టీ ట్విట్టర్ అకౌంట్ లోని ఒరిజినల్ ప్రెస్ రిలీజ్ చూస్తే పోస్ట్ లో ని ప్రెస్ రిలీజ్ ని ఫోటోషాప్ చేసినట్టుగా తెలుస్తుంది. పోస్ట్ లో ఎస్.పి.వై. రెడ్డి పేరు తీసేసి శ్రీ రెడ్డి పేరుని పెట్టారు. ఈ పోస్టే కాకుండా ఇంకా ఇలాంటి ఫేక్ ప్రెస్ రిలీజ్లు కొన్ని ఫేస్బుక్ లో షేర్ అవుతున్నాయి. ఉదాహరణకి ఒక పోస్ట్ లో కత్తి మహేష్, రామ్ గోపాల్ వర్మ, రేణు దేశాయ్, చిరంజీవి, తదితరులకు జనసేన టికెట్లు ఇచ్చినట్టుగా పోస్ట్ చేసారు. కావున, ఈ పోస్ట్ లో ఎలాంటి నిజం లేదు.

చివరగా, శ్రీ రెడ్డికి జనసేన టికెట్ ఇవ్వలేదు. పోస్ట్ చేసిన ప్రెస్ రిలీజ్ ఫోటోషాప్ చేయబడింది.

Share.

About Author

Comments are closed.

scroll