Fake News, Telugu
 

చిత్రం లో ఉన్న వ్యక్తి అదృశ్యo అయిన ఢిల్లీ JNU విద్యార్ధి నజీబ్ కాదు

0

ISIS మిలిటెంట్ల  ఫోటోతో కూడిన పోస్ట్ ఒక దానిని చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి ఢిల్లీ JNU నుండి అదృశ్యo అయిన నజీబ్ అహ్మద్ అంటూ అందులో పేర్కొన్నారు. ఇది ఎంతవరకు వాస్తవమో ఓసారి విశ్లేషిద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్చివ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.

క్లెయిమ్ (దావా): ఫొటోలో ఉన్న వ్యక్తి 2016 అక్టోబర్ లో అదృశ్యo అయిన ఢిల్లీ JNU విద్యార్థి నజీబ్ అహ్మద్.

ఫాక్ట్ (నిజం):పోస్ట్ లో ఉన్న ఫోటో  ప్రముఖ వార్తా  సంస్థ  “INTERNATIONAL BUSINESS TIMES”  డిసెంబర్ 30, 2015 న ప్రచురితం చేసిన  ఒక ఆర్టికల్ లో లభించింది. దీని ఆధారంగా ఫొటోలో ఉన్న వ్యక్తి అదృశ్యo అయిన ఢిల్లీ JNU విద్యార్ధి నజీబ్ అహ్మద్ కాదు అని చెప్పవచ్చు. కావున పోస్ట్ లో పేర్కొన్న విషయాలు అవాస్తవాలు.

ఫేస్బుక్ పోస్ట్ లో ఉన్న ఫోటో ని గూగుల్  రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా దానిని  ప్రముఖ వార్తా  సంస్థ  “INTERNATIONAL BUSINESS TIMES”  డిసెంబర్ 30, 2015 న ప్రచురితం అయిన ‘ Iraq: The battle to regain control of Tikrit from Isis rages on’ అనే ఆర్టికల్లో లభించింది. పోస్ట్ లో పెట్టిన ఫోటో ని “Shi’ite fighters stands near a wall painted with the black flag commonly used by Islamic State militants in the town of Tal Ksaiba” అనే ఉప శీర్షికతో చూడవచ్చు. అనగా, ఈ ఫోటో JNU-ఢిల్లీ  విద్యార్ధి నజీబ్ అహ్మద్ అదృశ్యo అయిన తేదీ కంటే చాలా ముందుది. కావున ఈ ఫోటోలోన ఉన్నది పోస్ట్ లో ఆరోపించిన వ్యక్తి కాదు.

ఈ పోస్ట్ గత సంవత్సరం నుండే వ్యాప్తి లో ఉంది. అప్పట్లో దీని పై Alt News వారు ఆర్టికల్ రాసారు. మళ్ళీ ఇప్పుడు JNU నజీబ్ తల్లి ఫాతిమా నఫీజ్16 మార్చ్ 2019 న నరేంద్ర మోడీ ని తన కొడుకు ఆచూకి గురించి ట్విట్టర్ లో ట్వీట్ చేయడంతో ఈ విషయం తిరిగి వ్యాప్తిలోకి వచ్చింది.

చివరగా, ఫొటోలో ఉన్న వ్యక్తి ఢిల్లీ JNU  విద్యార్థి  నజీబ్ అహ్మద్ కాదు.

Share.

About Author

Comments are closed.

scroll