చాలా మంది ఫేస్బుక్ వినియోగదారులు మోడి, అమిత్ షా, రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేసినప్పటి ఫోటోలను పోస్ట్ చేసి రాహుల్ గాంధీ ఎన్నికల అధికారులతో అమర్యాదగా ప్రవర్తించారు అని ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజముందో ఓసారి విశ్లేషిద్దాం.
క్లెయిమ్ (దావా): రాహుల్ గాంధీ నామినేషన్ పత్రాలను దాఖలు చేసినప్పుడు ఎన్నికల అధికారులను అగౌరవపరిచారు.
ఫాక్ట్ (నిజం): పోస్టు లోని ఫోటో రాహుల్ గాంధీ అమేథీ లోక్ సభ నియోజకవర్గం నుండి తన నామినేషన్ దాఖలు చేసినప్పుడు తీసినది. ఈ కార్యక్రమం యొక్క వీడియో కవరేజ్ లో రాహుల్ గాంధీ నామినేషన్ ప్రక్రియ కొనసాగినంతసేపు నిల్చొనే ఉన్నాడు. కావున పోస్ట్ ప్రక్కద్రోవ పట్టించేలా ఉంది.
రాహుల్ గాంధీ అమేథీ మరియు వాయనాడ్ లోక్ సభ స్థానాల నుండి నామినేషన్ పత్రాలు దాఖలు చేశాడు. పోస్ట్ లో ఉన్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా అది రాహుల్ గాంధీ అమేథీ లోక్ సభ నియోజకవర్గం నుండి తన నామినేషన్ దాఖలు చేసినప్పటిది అని తెలిస్తుంది. ఈ కార్యక్రమాన్ని అన్ని ప్రముఖ వార్తా సంస్థలు ప్రసారం చేశాయి. ‘Rajya Sabha TV’ ఛానెల్ యొక్క వీడియో కవేరజ్ చుసిన్నట్లైతే రాహుల్ గాంధీ నామినేషన్ పత్రాలు కలెక్టర్ కి సమర్పించినప్పటి నుండి ఆ ప్రక్రియ కొనసాగినంతసేపూ నిల్చొనే ఉన్నాడు. వీడియోలో ఎక్కడా కూడా రాహుల్ ఉన్న వైపున కుర్చీలు కనిపించలేదు. కానీ, ఫోటో తీసిన యాంగిల్ వల్ల రాహుల్ ఒక కుర్చీలో కూర్చొని ఉండగా, EC అధికారులు రాహుల్ చేతిలో నుండి కాగితాలను తీసుకునేందుకు కొద్దిగా నిలుచున్నట్లుగా కన్పిస్తుంది. కావున పోస్ట్ లో ముందు నుండి తీసిన ఫోటో పెట్టి తప్పుదోవ పట్టిస్తున్నారు.
చివరగా, రాహుల్ గాంధీ నామినేషన్ ప్రక్రియ కొనసాగినంతసేపు నిల్చొనే ఉన్నాడు. కావున పోస్ట్ ప్రక్కద్రోవ పట్టించేలా ఉంది.