Fake News, Telugu
 

జాకీర్ నాయక్ తో ఫోటో లో ఉన్నది సూసైడ్ బాంబర్ కాదు, మలేషియాకి చెందిన ఇస్లాం బోధకుడు.

0

శ్రీలంక లో బాంబు దాడులకు కారణమైన సూసైడ్ బాంబర్ తో జాకీర్ నాయక్ కి సంబంధం ఉందంటూ ఫోటోలతో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ఫోటో లో ఉన్నది శ్రీలంక లో అమాయక ప్రజలను చంపిన సూసైడ్ బాంబర్.

ఫాక్ట్ (నిజం): ఫోటోలో సర్కిల్ చేయబడిన వ్యక్తి పేరు జామ్రి వినోత్. తను మలేషియాకి చెందిన ఇస్లాం బోధకుడు. తనకు జాకీర్ నాయక్ కి సంబంధం ఉంది, కానీ శ్రీలంక లో జరిగిన బాంబు దాడుల్లో తను సూసైడ్ బాంబర్ కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

శ్రీలంక లో జరిగిన దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదుల ఫోటోల గురించి గూగుల్ లో వెతికినప్పుడు  టైమ్స్ అఫ్ ఇండియా ప్రచురించిన ఆర్టికల్ వస్తుంది. దాంట్లో ముగ్గురి ఫోటోలు ఉంటాయి, కానీ ఒక్కరి ముఖమే సరిగ్గా కనపడుతుంది. ఆ ఒక్కడి ముఖం కూడా పోస్ట్ లో ఉన్న వ్యక్తి తో సరిపోదు.

అలానే, పోస్ట్ లో ఉన్న వ్యక్తి గురించి వెతకగా తన పేరు జామ్రి వినోత్ అని తెలుస్తుంది. తన ఇంస్తాగ్రాం అకౌంటు చూస్తే, తను జాకీర్ నాయక్ తో దిగిన మిగితా ఫోటోలు కూడా ఉంటాయి. తన గురించి గూగుల్ లో వెతకగా హిందువులని అవమానించినందుకు గత వారం మలేషియాన్ పోలీసులు తనను అరెస్ట్ చేసినట్టు malaymail ఆర్టికల్ దొరుకుతుంది. అదే ఆర్టికల్ లో జామ్రి వినోత్ తన మతాన్ని ఇస్లాంకి మార్చుకున్నాడని, తను జాకీర్ నాయక్ అనుచరుడని ఉంటుంది. కావున తనకు జాకీర్ నాయక్ కి సంబంధం ఉందనేది నిజమే, కానీ శ్రీలంక లో జరిగిన బాంబు దాడుల్లో తను సూసైడ్ బాంబర్ అనేది అబద్ధం.

చివరగా, జాకీర్ నాయక్ తో ఫోటో లో ఉన్నది సూసైడ్ బాంబర్ కాదు, మలేషియా కి చెందిన ఇస్లాం బోధకుడు. 

Share.

About Author

Comments are closed.

scroll