Fake News, Telugu
 

పోస్ట్ లో చెప్పిన దాన్ని ఏ స్వీడన్ పత్రిక ప్రచురించలేదు

0

వింగ్ కమాండర్ అభినంధాన్ వర్ధమాన్ ని పాకిస్తాన్ విడుదల చేయడానికి ముందు చాలా పెద్ద కథ జరిగిందంటూ ఉన్న ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): స్వీడన్ కి చెందిన పత్రిక అభినందన్ ని పాకిస్తాన్ విడిచిపెట్టడానికి గల కారణాలతో కూడిన ఒక కథని ప్రచురించింది.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో చెప్పిన దాన్ని ఏ స్వీడన్ పత్రిక ప్రచురించలేదు. పోస్ట్ లో చివరగా ఇచ్చిన ట్విట్టర్ అకౌంట్ కూడా ఇప్పుడు లేదు. కావున పోస్ట్ లో స్వీడన్ పత్రిక ప్రచురించినట్టుగా చెప్పింది అబద్ధం.

నిజంగా పోస్ట్ లో చెప్పినది నిజమో కాదో తేల్చలేము కానీ స్వీడన్ పత్రిక ప్రచురించిందో లేదో కనిపెట్టొచ్చు. పోస్ట్ లో చెప్పిన విషయల గురించి ఏదైన స్వీడన్ పత్రిక ప్రచురించిందా అని వెతికినప్పుడు, అసలు అలాంటి ఆర్టికల్స్ ఏవి కూడా ఇంటర్నెట్ లో లేవు. అలానే పోస్ట్ లో చివరగా సేకరణ అంటూ ఒక ట్వీట్ సోర్సు ఉంటుంది. ఆ ట్విట్టర్ అకౌంట్ కోసం చూస్తే ఆ అకౌంట్ ఇప్పుడు తీసేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి పోస్ట్ లో చెప్పిన వాటికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇచ్చిన ఒక్క ట్విట్టర్ అకౌంట్ సోర్స్ కూడా ఇప్పుడు లేదు. ఇదే విషయం మీద క్లారిటీ కోసం Factly భారత్ లోని స్వీడన్ ఎంబసీ కి ఈ-మెయిల్ చేసింది. వాళ్ళు సమాధానం చెప్పినప్పుడు ఈ ఆర్టికల్ అప్డేట్ చేస్తాము.

చివరగా, ఏ స్వీడన్ పత్రిక కూడా పోస్ట్ లో చెప్పిన దాన్ని ప్రచురించలేదు. పోస్ట్ లో ఇచ్చిన ట్విట్టర్ సోర్స్ కూడా ఇప్పుడు లేదు.

వివరణ: ఢిల్లీ లోని స్వీడన్ ఎంబసీ అధికార ప్రతినిధి Factly ఈ-మెయిల్ కి సమాధానమిస్తూ, అటువంటి మీడియా రిపోర్ట్ గురుంచి తమ వద్ద ఎటువంటి సమాచారం లేదని చెప్పారు.

Share.

About Author

Comments are closed.

scroll