పాకిస్తాన్ లోని ఒక టీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా భారత వాయుసేన వింగ్ కమాండర్ అని ఒక యాడ్ ని చాలా మంది ఫేస్బుక్ మరియు వేరే సోషల్ మీడియా సైట్స్ లో షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
క్లెయిమ్ (దావా): పాక్ టీ బ్రాండ్ అంబాసిడర్ గా అభినందన్.
ఫాక్ట్ (నిజం): పాక్ టీ కంపెనీ యాడ్ గా చూపెడుతున్న వీడియో ఎడిట్ చేయబడింది. కావున పాకిస్తాన్ లోని ఒక టీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా అభినందన్ అంటూ వస్తున్న పోస్ట్ లల్లో ఎలాంటి వాస్తవం లేదు.
మొదటి గా యాడ్ లో చూపెడుతున్న కంపెనీ పేరును గూగుల్ లో సెర్చ్ చేస్తే అది నిజంగానే పాకిస్తాన్ కి సంభందించిన టీ కంపెనీ గా తెలుస్తుంది. తరువాత యూట్యూబ్ లో ‘Tapal Tea Ad’ అని సెర్చ్ చేస్తే యాడ్ కి సంభందించిన ఒరిజినల్ వీడియో వస్తుంది. ఎనిమిదేళ్ళ క్రితం పోస్ట్ చేసిన ఆ వీడియో లోని కొన్ని ఫ్రేమ్స్ ఎడిట్ చేసి అభినందన్ పాకిస్తాన్ ఆర్మీ దగ్గర ఉన్నప్పుడు తీసిన వీడియో సన్నివేశాలు జోడించారు. కావున, ఫేస్బుక్ లో షేర్ అవుతున్న వీడియో లో వాస్తవం లేదు.
చివరగా, పాక్ టీ అంబాసిడర్ గా అభినందన్ అని వైరల్ అవుతున్న యాడ్ తప్పుదోవ పట్టించడానికి ఎడిట్ చేయబడింది.