Fake News, Telugu
 

అది తమిళనాడు లో పట్టుకున్న 130 కోట్లకి సంభందించిన వీడియో. నారాయణ స్కూల్ ది కాదు

0

ఎన్నికల సందర్భంగా నారాయణ కాలేజీలో 150 కోట్లు పట్టుకున్నారు అంటూ వీడియో మరియు ఫోటోలతో కూడిన ఒక పోస్ట్ ని చాలా మంది ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): నారాయణ కాలేజీలో 150 కోట్లు పట్టివేత.

ఫాక్ట్ (నిజం): నారాయణ స్కూల్ లో పది లక్షలు మాత్రమే పట్టుకున్నారు. పోస్ట్ లో ఉన్న ఫోటోలు నారాయణ స్కూల్ కి సంబంధించినవే, కానీ వీడియో మాత్రం తమిళనాడు లో DMK అభ్యర్థి దగ్గర పట్టుకున్న 130 కోట్లకు సంభందించినది. కావున పోస్ట్ లో తమిళనాడు కి సంభందించిన వీడియో పెట్టి నారాయణ కాలేజీలో 150 కోట్లు పట్టుకున్నారు అని తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ లోని వీడియో చూస్తే దాంట్లో ఉన్నవాళ్లు తమిళ్ లో మాట్లాడుతున్నట్టు వినొచ్చు. కాబట్టి గూగుల్ లో ‘Cash found in Tamil Nadu’  అని సెర్చ్ చేస్తే NDTV ఆర్టికల్ ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ ఆర్టికల్ ప్రకారం తమిళనాడు లోని వెల్లోర్ లో DMK పార్టీకి చెందిన లీడర్ యొక్క అనుచరుడి గోడౌన్ లో 130 కోట్ల వరకు పట్టుకున్నారని తెలుస్తుంది. పోస్ట్ లోని వీడియోని ఆ ఆర్టికల్ లో చూడవచ్చు.  కావున పోస్ట్ లో పెట్టిన వీడియోకి నారాయణ కాలేజీకి ఎటువంటి సంబంధం లేదని తెలుస్తుంది.

పోస్ట్ లోని ఫోటోలు గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే అవి నారాయణ స్కూల్ కి సంబంధించినవేనని తెలుస్తుంది. సెర్చ్ రిజల్ట్స్ లో సాక్షి పోస్ట్ ఆర్టికల్ ఒకటి వస్తుంది. దాని ప్రకారం ఎలక్షన్ స్క్వాడ్ వారు నెల్లూరు లోని నారాయణ స్కూల్ లో పది లక్షలు సీజ్ చేసారు. కావున పోస్ట్ లో చెప్పినట్టు నారాయణ స్కూల్ లో పట్టుకున్నది 150 కోట్లు కాదు.

చివరగా, నారాయణ స్కూల్ లో పది లక్షలు మాత్రమే పట్టుకున్నారు, తమిళనాడు లో పట్టుకున్న 130 కోట్ల వీడియో పోస్ట్ లో పెట్టి తప్పుదోవపట్టిస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll