ధోనీ తాను రిటైర్మెంట్ తీసుకోననీ, 2020 లో జరిగే ICC T20 వరల్డ్ కప్ లో ఆడుతానని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడని చాలా మంది ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో పేర్కొన్న విషయాల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.


క్లెయిమ్ (దావా): ధోనీ ICC వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో ఇండియా ఓటమి అనంతరం తాను రిటైర్మెంట్ తీసుకోనని, 2020 లో జరిగే ICC T20 వరల్డ్ కప్ లో ఆడుతానని ప్రకటించాడు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో పెట్టిన వీడియోలో ధోనీ తాను 2020 లో జరిగే ICC T20 వరల్డ్ కప్ లో ఆడుతానని చెప్పినట్లుగా ఉన్న ట్వీట్ ఒక మార్ఫ్ చేయబడిన ట్వీట్. ధోని ICC T20 వరల్డ్ కప్ లో తాను ఆడుతానని ప్రకటించినట్లుగా ఏ వార్తా పత్రిక కూడా పేర్కొనలేదు. కావున, పోస్ట్ లో ఆరోపించిన విషయాల్లో నిజం లేదు.
పైన పోస్టులో ఉన్న వీడియోలో ధోనీ ICC వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో ఇండియా ఓటమి అనంతరం తాను రిటైర్మెంట్ తీసుకోనని, 2020 లో జరిగే ICC T20 వరల్డ్ కప్ తాను ఆడుతానని పెట్టినట్లుగా ఉన్న ఒక ట్వీట్ చూడవచ్చు. దీని గురించి ధోని అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెతికినప్పుడు, అటువంటి ట్వీట్ ఏది లభించలేదు. ధోని చివరగా, మే 6, 2019 న “ Use your power” అంటూ ఒక ఇంస్టాగ్రామ్ లింక్ తో కూడిన ట్వీట్ ని పెట్టాడు. ఇండియా ICC వరల్డ్ కప్ లో న్యూజీలాండ్ తో సెమీ ఫైనల్ జులై 9, 2019 తేదీన ఆడింది. కావున, పోస్టులో పెట్టిన ట్వీట్ ఒక ఫోటోషాప్ చేయబడిన ట్వీట్.
Use your Power https://t.co/YAA9IlkwVF
— Mahendra Singh Dhoni (@msdhoni) May 6, 2019
ఫేస్బుక్ పోస్ట్ లోని ట్వీట్ లో కనిపించే ఇంస్టాగ్రామ్ లింక్ ద్వారా వెతికినప్పుడు, ఒక వీడియో లభించింది. ఆ వీడియో ఆధారంగా ధోని చేసిన ట్వీట్ కోసం ఆయన ఖాతాలో వెతికినప్పుడు, అతను డిసెంబర్ 18, 2018 న పెట్టిన ట్వీట్ లభించింది. అనగా, ధోని డిసెంబర్ 18న పెట్టిన ఈ ట్వీట్ ని ఎడిట్ చేసి పైన పేర్కొన్న ఆరోపణలతో ప్రచారం చేస్తున్నారని తెలుసుకోవచ్చు.
Were you wondering who the mystery icon panerai_india, @PaneraiOfficial and panerai_me were referring to? Guess no more! I am very happy to announce my collaboration with my new Panerai… https://t.co/8crjHU9Xvf
— Mahendra Singh Dhoni (@msdhoni) December 18, 2018
ధోని తాను రిటైర్మెంట్ ఇవ్వట్లేదని, 2020 వరల్డ్ కప్ కూడా ఆడుతానని ప్రకటిస్తే దేశంలోని అన్ని ప్రముఖ పత్రికలు కథనాలు ప్రచురించేవి. కానీ, అలా ఏ వార్తా పత్రిక కూడా పేర్కొనలేదు అని తెలిసింది.
చివరగా, ధోనీ తాను రిటైర్మెంట్ తీసుకోవట్లేదని మరియు 2020 లో జరిగే ICC T20 వరల్డ్ కప్ లో ఆడుతాననీ ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?