Fake News, Telugu
 

బాంగ్లాదేశ్ లో జరిగిన ఒక మీటింగ్ ఫోటోని ముస్లింలు నమాజ్ కోసం ఢిల్లీ వీధుల్ని బ్లాక్ చేసినట్టు తప్పుగా చూపిస్తున్నారు

0

ఫేస్బుక్ లో మూడు ఫోటోలు ఉన్న ఒక కొల్లెజ్ ని పోస్ట్ చేసి అందులో పైన ఉన్న ఫోటో ముస్లింలు నమాజ్ కోసం డిల్లీలోని వీధుల్ని బ్లాక్ చేసినదనీ, క్రింది ఫోటోలు ఒక్క అంబులెన్సు కోసం 15 లక్షలమంది భక్తులు పాల్గొన్న రథయాత్ర లో హ్యూమన్ కారిడార్ లాగా ఏర్పడి అంబులెన్సుకు దారి ఏర్పరిచిన 750 మంది RSS కార్యకర్తలవనీ పేర్కొంటున్నారు. ఆ పోస్ట్ లో పేర్కొన్న విషయాల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): కొల్లెజ్ లో పైన ఉన్న ఫోటో ముస్లింలు నమాజ్ కోసం డిల్లీ వీధుల్ని బ్లాక్ చేసినది.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో ముస్లిములు ప్రార్ధన చేస్తున్నట్లుగా ఉన్న ఫోటో 2015 లో బాంగ్లాదేశ్ లోని తోంగీలో జరిగిన “బిష్వా ఇజ్తేమా” అనే ప్రపంచ సమ్మేళనం జరిగినప్పుడు తీసినది. కావున, పోస్ట్ లో పేర్కొన్న విషయాల్లో నిజం లేదు.  

పోస్ట్ లో ఉన్న ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా, అది “www.robertharding.com” అనే వెబ్సైటు లో లభించింది. ఆ వెబ్సైటులో ఉన్న సమాచారం ద్వారా, ఆ ఫోటోని ఎం.యూసుఫ్ తుషర్ అనే ఫోటోగ్రాఫర్ తీసినట్లుగా తెలిసింది. గూగుల్ లో “M Yusuf photography” అని వెతికినప్పుడు, ఆయన అధికారిక వెబ్సైటు అడ్రస్ లభించింది. ఆ వెబ్సైటు లో పొందుపరిచిన ఫొటోలను చూసినప్పుడు, పోస్టులో పెట్టిన ముస్లింలు ప్రార్ధన చేస్తున్న ఫోటో లభించింది. దాని క్రింద ఉన్న వివరణ చూసినప్పుడు, దానిని యూసుఫ్ తుషర్ 2015 లో బాంగ్లాదేశ్ లోని తోంగీలో జరిగిన “బిష్వా ఇజ్తేమా” అనే ప్రపంచ సమ్మేళనం సందర్భంగా తీసినట్లుగా ఆయన పేర్కొన్నారు. ప్రతీ సంవత్సరం, ఈ వేడుక తొంగీ అనే ప్రాంతంలోని తురగ్ అనే నది ఒడ్డున జరుగుతుందనీ,  2015లో జరిగిన ఈ ఉత్సవంలో సుమారు 150 దేశాల నుండి వచ్చిన 40లక్షల మంది ముస్లిములు పాల్గొన్నారని కూడా ఆయన ఆ ఫోటో క్రింద వివరించారు.

చివరగా, పోస్ట్ లో ముస్లింలు ప్రార్ధన చేస్తున్న ఫోటో వారు నమాజ్ కోసం ఢిల్లీ వీధుల్ని బ్లాక్ చేసినది కాదు. అది బాంగ్లాదేశ్ లోని తోంగీలో జరిగిన “బిష్వా ఇజ్తేమా” అనే ప్రపంచ సమ్మేళనం లో ముస్లింలు ప్రార్ధన చేస్తున్నప్పటిది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?


Share.

About Author

Comments are closed.

scroll