ఢిల్లీలోని జామా మస్జిద్ వద్ద మీనా బజార్ లో ఉగ్రవదులు టైం బాంబు పెట్టారని, అది పేలటానికి మూడు నిముషాలు ఉన్నప్పుడు అధికారులు దాన్ని పేలకుండా ఆపారని కొన్ని ఫోటోలతో ఉన్న ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ : ఢిల్లీ జామా మస్జిద్ దగ్గరున్న మీనా బజార్ లో టైం బాంబు పెట్టిన ఉగ్రవాదులు. పెలటానికి మూడు నిమిషాల ముందు ఆపిన అధికారులు.
ఫాక్ట్ (నిజం): ఢిల్లీ పోలీసువారు నిర్వహించిన ఒక మాక్ డ్రిల్ లో భాగంగా పెట్టిన డమ్మీ బాంబు అది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని విషయం గురించి గూగల్ లో ‘Bomb defused at Jama Masjid’ అని వెతకగా, ‘ANI’ వార్తాసంస్థ వారు ఈ విషయం పై చేసిన ట్వీట్ ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. పోస్ట్ లోని ఫోటోలు కూడా ‘ANI’ వార్తాసంస్థ వారు పెట్టిన ట్వీట్ లో చూడొచ్చు. కాకపోతే అది కేవలం ఒక మాక్ డ్రిల్ అని ఆ ట్వీట్ లో ఉంటుంది. ఆ మాక్ డ్రిల్ లో భాగంగా ఢిల్లీ పోలీసు వారు ఒక డమ్మీ బాంబు ను కూడా డిఫ్యుస్ చేసినట్టు ఆ ట్వీట్ ద్వారా తెలుస్తుంది
Delhi Police: Delhi Police today conducted a mock drill at Tibetan Woolen Market near Jama Masjid. The team also defused a dummy bomb at the drill. pic.twitter.com/m1fHajLn7n
— ANI (@ANI) August 11, 2019
చివరగా, ఢిల్లీ మీనా బజార్ లో ఉగ్రవాదులు టైం బాంబు పెట్టినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అది ఒక మాక్ డ్రిల్ మాత్రమే.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?