Fake News, Telugu
 

‘భారత్ వైపు కన్నెత్తి చూస్తే చైనాను కనపడకుండా చేస్తాం’ అని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ అనలేదు

0

కొంతమంది ఫేస్బుక్ లో ఒక పోస్టు పెట్టి భారత్ వైపు కన్నెత్తి చూస్తే చైనాను కనపడకుండా చేస్తాం అని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ అన్నాడంటూ ఆరోపిస్తున్నారు. వాటిలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : భారత్ వైపు కన్నెత్తి చూస్తే చైనాను కనపడకుండా చేస్తాం అని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ అన్నాడు.    

ఫాక్ట్ (నిజం): పోస్టులో ఆరోపించిన వ్యాఖలు కిమ్ జాంగ్ చేసినట్లుగా వార్తాపత్రికలు కానీ, మీడియా కానీ ఎక్కడా కూడా రిపోర్ట్ చేయలేదు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.    

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ పోస్టులో ఆరోపించిన వ్యాఖలు చేశాడా అని వెతికినప్పుడు, అందుకు సంబంధించిన ఎటువంటి సమాచారం కూడా లభించలేదు. ఒక వేల కిమ్ జాంగ్ నిజంగానే అటువంటి వ్యాఖ్యలు చేసినట్లయితే దేశం లోని అన్ని ప్రముఖ వార్తా పత్రికలూ మరియు మీడియా సంస్థలు దాని గురించి ప్రచురించేవి. కానీ, అటువంటి న్యూస్ ఎవరు కూడా ప్రచురించలేదు.

పోస్టులో ఉన్న కిమ్ జాంగ్ ఫోటోని క్రాప్ చేసి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అది కిమ్ ‘కొరియా పీపుల్స్ ఆర్మీ’ 71 వ వార్షికోత్సవం సందర్భం గా ప్రసంగించినప్పటిది అని తెలిసింది.

చివరగా, ‘భారత్ వైపు కన్నెత్తి చూస్తే చైనాను కనపడకుండా చేస్తాం’ అని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ అనలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll