Fake News, Telugu
 

‘డీజే సౌండ్ తగ్గించలేదని డ్రోన్ తో దాడి’ అని వస్తున్న వార్తల్లో నిజం లేదు

0

డీజే సౌండ్ తగ్గించలేదని ఒక వ్యక్తి తన పక్కింటి వారి పై డ్రోన్ సహాయంతో దాడి చేసాడని చెప్తూ ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): డీజే సౌండ్ తగ్గించలేదని డ్రోన్ తో దాడి.

ఫాక్ట్ (నిజం): ఆల్బర్ట్ (వీడియో తీసిన వ్యక్తి) బీబీసీ తో మాట్లాడుతూ వీడియోలో ఉన్నది నిజం కాదని, అది కేవలం తన మిత్రులతో కలిసి సరదాగా చేసిన ఒక ప్రాంక్ వీడియో అని చెప్పాడు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.  

పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో ‘Fireworks Drone Attack’ అని వెతకగా, ఒక బీబీసీ ఆర్టికల్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ ఆర్టికల్ లో డ్రోన్ ద్వారా పక్కింటి వాళ్ళ పై ఒక వ్యక్తి దాడి చేసినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఉంటుంది. ఆల్బర్ట్ (వీడియో తీసిన వ్యక్తి) బీబీసీ తో మాట్లాడుతూ అది కేవలం తన మిత్రులతో సరదాగా చేసిన వీడియో అని, ఇంతకు ముందు కూడా అతను ఎడిట్ చేసిన చాలా వీడియోలు పోస్ట్ చేసినట్టు చెప్పాడు. అంతేకాదు, వీడియో లో పరిగెడుతూ కనిపించిన వారితో ఆల్బర్ట్ దిగిన ఫోటో కూడా బీబీసీ ఆర్టికల్ లో చూడవచ్చు.

వైరల్ అవుతున్న వీడియోని ఆల్బర్ట్ తన Instagram అకౌంట్ లో జూలై 14న పోస్ట్ చేసినట్టు చూడవచ్చు. ఆ పోస్ట్ లో వివరణ లో కూడా డీజే సౌండ్ గురించి ఆల్బర్ట్ రాయలేదు. తన ఫ్రెండ్స్ తనను పార్టీ కి పిలవలేదని దాడి చేసానని రాసాడు.

సోషల్ మీడియా లోని వారు మాత్రమే కాదు, ఇంగ్లీష్ వార్తా సంస్థలు (India Today, Republic World) కూడా ఈ వీడియో నిజం అనుకొని వాళ్ళ వెబ్ సైటుల్లో ప్రచురించినట్టు బీబీసీ ఆర్టికల్ లో చదవచ్చు.

చివరగా, ‘డీజే సౌండ్ తగ్గించలేదని డ్రోన్ తో దాడి’ అని వస్తున్న వార్తల్లో నిజం లేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll