Fake News, Telugu
 

‘కాశ్మీర్లోని ఉగ్రవాదులకు దేహశుద్ది’ అంటూ పుల్వామా ఘటన తర్వాత వ్యాప్తిలో ఉన్న వీడియోలో నిజం లేదు

0

పుల్వామా ఘటన అనంతరం ‘ హిందూ హిందుత్వం – Hindu Hindutvam’ అనే ఫేస్బుక్ పేజీ ‘కాశ్మీర్లోని ఉగ్రవాదులకు దేహశుద్ది’ అంటూ ఒక వీడియో ని పోస్ట్ చేసింది. దానిని 3000 మందికిపైగా లైక్ చేశారు. ఆ వీడియో ఎంతవరకు వాస్తవమో ఒకసారి విశ్లేషిద్దాం .

క్లెయిమ్ (దావా): కాశ్మీర్లోని ఉగ్రవాదులకు భారత ఆర్మీ దేహశుద్ది.

ఫాక్ట్ (నిజం): వీడియోని ‘ఇన్విడ్’ అనే గూగుల్ ఎక్స్టెన్షన్ లో ఫ్రాగ్మెంటేషన్ చెయ్యగా అనేక చిత్రాలు వచ్చాయి. వాటిని ‘యాండెక్స్ ’ వెబ్సైట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే ఆ వీడియోని కొన్ని నెలల క్రితమే ట్విట్టర్ ,యూట్యూబ్ లలో వివిధ సందర్భాలలో అప్లోడ్ చేసినట్టుగా అర్ధం అవుతుంది. పాకిస్థాన్ జర్నలిస్ట్ ‘హమీద్ మీర్’ భారత సైన్యం కాశ్మీర్లోని యువతని హింసిస్తున్నారు అంటూ ట్విటర్లో ట్వీట్ చేసారు. ‘డైలీ మోషన్’ ప్లాట్ఫారంలో బలోచిస్తాన్ ఛానల్ అనే ఖాతా ద్వారా ‘బలోచిస్తాన్ ప్రాంతంలలోని ప్రజలను అపహరించి పాకిస్థాన్ టార్చర్ సెల్ లో వారిని హింసిస్తున్నారు’ అంటూ అప్లోడ్ చేసారు. ఇలా ఈ వీడియోని అనేక సందర్భాల్లో అప్లోడ్ చేసారు. కానీ మనం క్షుణ్ణం గా వీడియోని పరిశీలించినట్టైతే 0:09 సె. దగ్గర నుండి 0:18 సె . మధ్య ఫ్రాగ్మెంట్స్ లో కనిపిస్తున్న ఆర్మీ అధికారి షర్ట్ జేబు దగ్గర పాకిస్థాన్ జెండా చూడవచ్చు . అది పాకిస్థాన్ ఆర్మీ వారు బలోచిస్తాన్ వారిని ప్రిసన్ సెల్ లో హింసించేది అయ్యుండవచ్చూ .

కావున  పుల్వామా ఘటన తర్వాత భారత ఆర్మీ కాశ్మీర్ లో ని ఉగ్రవాదులను నిర్బంధించి వారికి  దేహశుద్ది  చేస్తోంది అనే వాదనతో పెట్టిన వీడియోలో ఎంత మాత్రము నిజం లేదు.

చివరగా, ఆ వీడియో కాశ్మీర్లోని ఉగ్రవాదులకు భారత ఆర్మీ దేహశుద్ది చేస్తున్నప్పటిది కాదు. అది ఒక పాత వీడియో .

Share.

About Author

Comments are closed.

scroll