Fake News, Telugu
 

కశ్మీర్‌లో చనిపోయిన టెర్రరిస్ట్ లకు కాంగ్రెస్ కోటి రూపాయల బహుమతి ప్రకటించిందా?

0

కశ్మీర్‌లో చనిపోయిన టెర్రరిస్ట్ లకు కాంగ్రెస్ కోటి రూపాయల బహుమతి ప్రకటించిందని కావున పుల్వామా లో జరిగిన ఉగ్రవాద దాడికి కాంగ్రెస్ బాధ్యత వహించాలని రచ్చ కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఫేస్బుక్ లో పోస్ట్ చేసాడు. తను రాసిన పోస్ట్ లో ఎంత నిజముందో విశ్లేషిద్దాం.

క్లెయిమ్ (దావా): కాశ్మీర్ లో చనిపోయిన టెర్రరిస్ట్ లకు 1 కోటి బహుమతి ప్రకటించిన కాంగ్రెస్ దీనికి (పుల్వామా దాడి) బాధ్యత వహించాలి

ఫాక్ట్ (నిజం): కాంగ్రెస్ పార్టీ టెర్రరిస్ట్ లకు ఎలాంటి బహుమతి ప్రకటన చేయలేదు. కానీ 2018 లో కాంగ్రెస్ లీడర్ హాజీ సఘీర్ సయీద్ ఖాన్ కాశ్మీర్ లో బీ.జే.పీ ప్రభుత్వం వల్ల చనిపోయిన అమాయకులకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కి వస్తే 1 కోటి పరిహారం ఇస్తామని అన్నారు. ఆ ప్రకటనని కూడా జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ విక్రం మల్హోత్రా కొట్టి పారేసారు. అది సఘీర్ సయీద్ వ్యక్తిగత అభిప్రాయమని కాంగ్రెస్ పార్టీ అలాంటి ఎటువంటి ప్రకటన చేయలేదు అని చెప్పారు.

చివరగా, కాంగ్రెస్ పార్టీ టెర్రరిస్ట్ లకు ఎలాంటి బహుమతి ప్రకటించలేదు. తమ లీడర్ చేసిన వాక్యాలను కూడా కన్డించింది.

Share.

About Author

Comments are closed.

scroll