Fake News, Telugu
 

కళ్యాణలక్ష్మీ మరియు షాదీ ముబారక్ ఎవరికయినా ఒక్కసారి మాత్రమే వర్తిస్తాయి

0

తెలంగాణ రాష్ట్రం లో కళ్యాణలక్ష్మీ మరియు షాదీ ముబారక్ పథకాల కింద రెండో పెళ్లికి కూడా ఆర్ధిక సహాయం వర్తిస్తుందని ఫేస్బుక్ లో కొందరు పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్టుల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): రెండో పెళ్ళికి కూడా కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పైసలు ఇస్తారు.

ఫాక్ట్ (నిజం): తెలంగాణ ప్రభుత్వ G.O. ప్రకారం ఒక్కరికి ఒక పెళ్ళికి మాత్రమే ఆర్ధిక సహయం అందచేస్తారు. అది రెండో పెళ్లి లేక మొదటి పెళ్లా అన్న దానితో సంభంధం లేదు అని ఆ G.O. లో ఉంది. చాలా మంది దీన్ని చూసి ఎన్ని సార్లు చేసుకుంటే అన్ని సార్లు ఆర్థిక సహాయం వర్తిస్తుందని అనుకుంటున్నారు. ఎన్ని సార్లు చేసుకున్నా ఒక్కరికి ఒక పెళ్ళికి మాత్రమే ఆర్ధిక సహయం అందచేస్తారు. కావున పోస్ట్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్ట్ కింద కామెంట్స్ చూస్తే కొంత మంది ఎన్ని సార్లు పెళ్లి చేసుకుంటే అన్ని సార్లు పథకం ద్వారా సహాయం అందుతుందని భావిస్తున్నట్టు తెలుస్తుంది.

పోస్ట్ లోని విషయం పై గూగుల్ లో వెతకగా, రెండో సారి పెళ్లికి కూడా కళ్యాణ లక్ష్మీ మరియు షాదీ ముబారక్ పథకాలు వర్తిస్తాయని తెలంగాణ ప్రభుత్వం జీ.ఓ. విడుదల చేసిందని తెలుస్తుంది. సిద్దిపెటకి చెందిన ఒక వ్యక్తి తన చెల్లి రెండవ పెళ్ళికి కళ్యాణలక్ష్మీ పథకం వర్తిస్తుందా అని అడిగినందుకు తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చిందని జీ.ఓ. ద్వారా తెలుస్తుంది. వివరణ లో కళ్యాణ లక్ష్మీ మరియు షాదీ ముబారక్ పథకాల ద్వారా ఎవరైన ఒక్క సారి మాత్రమే సహాయం పొందవచ్చని, అది రెండో పెళ్లి లేక మొదటి పెళ్లా అన్న దానితో సంబందం లేదు అని ఆ G.O. లో ఉంది. కావున ఎన్నో పెళ్లి అయినా అంతకు ముందు పెళ్లికి సహాయం పొందకుంటే వాళ్ళు ఆర్ధిక సహాయానికి అర్హులని ఉంటుంది. కొంత మంది ప్రజలు అనుకుంటున్నట్టుగా ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటే అన్ని సార్లు ప్రభుత్వం సహాయం చేయదు.

చివరగా, కళ్యాణలక్ష్మీ మరియు షాదీ ముబారక్ పథకాల కింద ఎవరయినా ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు సహాయానికి అర్హులు కారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?


Share.

About Author

Comments are closed.

scroll