Fake News, Telugu
 

ఆంధ్రప్రదేశ్ లో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ని కొందరు తాగుబోతులు కొట్టిన వీడియో పెట్టి తప్పుగా ప్రచారం చేస్తున్నారు

0

టీ.ఆర్.ఎస్ ప్రభుత్వ పాలనలో పోలీసులకు విలువలేకుండా పోతుంది అంటూ ఒక వీడియో తో  కూడిన ఒక పాత పోస్ట్ ని ఫేస్బుక్ లో ఇప్పుడు చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): టీ.ఆర్.ఎస్ పాలనలో పోలీసును కొట్టిన ఎం.ఎల్.సీ కొడుకు.

ఫాక్ట్ (నిజం): వీడియో తీసింది ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం లో. కొట్టింది ఎం.ఎల్.సీ కొడుకు కాదు. వీడియో లో ఎం.ఎల్.సీ కొడుకు అని చెప్పిన మాటల్లో నిజం లేదని పోలీసు వారు తెలిపారు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

ఫేస్బుక్ లో ఈ వీడియోని గత సంవత్సరం లోనే పోస్ట్ చేసారు, కానీ మళ్ళీ ఆ పాత పోస్ట్ ని ఇప్పుడు చాలా మంది ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు.


పోస్ట్ లోని వీడియోని సరిగ్గా చూస్తే పోలీస్ డ్రెస్ మీద ‘AP’ అని రాసి ఉండడం చూడొచ్చు. అంతే కాకుండా ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో అయ్యిందని కామెంట్స్ లో చాలా మంది రాసారు. కావున, గూగుల్ లో ‘AP Police beaten’ అని వెతకగా, వీడియో లోని ఘటన గత సంవత్సరం ఆగష్టులో శ్రీశైలం లో జరిగిందని తెలుస్తుంది. NTV యూట్యూబ్ లో పెట్టిన వీడియో ప్రకారం అటవీ ప్రాంతంలో మద్యం తాగొద్దని ఫారెస్ట్మ్ సెక్షన్ ఆఫీసర్ సూచించడంతో కొందరు వ్యక్తులు తనని కొట్టి, కాళ్ళు మొక్కిన్చుకున్నారు. తాము ఎం.ఎల్.సీ మనుషులమని, ఎం.ఎల్.సీ కొడుకు కూడా తమతో ఉన్నాడని వారు ఆఫీసర్ ని బెదిరించారు.

ఆ ఎం.ఎల్.సీ పేరు రంగా రెడ్డి (తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎం.ఎల్.సీ) అని , వీడియోలోని వారు తన కొడుకు మరియు అతని అనుచరులని అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలన్నిటిని ఖండిస్తూ తనకు కానీ, తన కుమారుడికి కానీ వీడియో లోని వ్యక్తులతో అస్సలు సంబంధం లేదని రంగా రెడ్డి TV9 కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

ఈ ఘటన గత సంవత్సరం వైరల్ అయినప్పుడు BOOM వారు పోలీసులతో మాట్లాడగా, ఎం.ఎల్.సీ తో సంబంధం ఉందని చెప్పిన వ్యక్తి తండ్రి పోలీసులతో రంగా రెడ్డి దూరపు చుట్టమని, చాలా ఏళ్ళగా అసలు రంగా రెడ్డి తో మాట్లాడలేదని చెప్పాడు. కావున, ఫారెస్ట్ ఆఫీసర్ ని కొట్టింది ఎం.ఎల్.సీ కొడుకు కాదు.

చివరగా, ఆంధ్రప్రదేశ్ లో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ని కొందరు తాగుబోతులు కొట్టిన వీడియో పెట్టి ,
చాలా మంది టి ఆర్ ఎస్ పాలనలో పోలీసులంటే కూడా విలువలేకుండా పోయిందంటూ తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

వివరణ:
ఈ విషయం వైరల్ అవ్వడం తో హైదరాబాద్ పోలీస్ వారు తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా వైరల్ అవుతున్న సమాచారం లో నిజం లేదని ట్వీట్ చేసారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?


Share.

About Author

Comments are closed.

scroll