Fake News, Telugu
 

కేక్ కోసం ప్రజలు కొట్టుకుంటున్న ఈ వీడియో వై.ఎస్.జగన్ పుట్టిన రోజు వేడుకలకు సంబంధించింది కాదు

0

21 డిసెంబర్ న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ పుట్టిన రోజు సందర్భంగా, ‘చివరికి కేక్ కోసం కొట్టుకొనెలా తయారయ్యిందా నా రాష్ట్రం’ అని చెప్తూ, ‘జగనన్నా జగనన్నా’ పాట తో కూడిన వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కోసం ప్రజలు కొట్టుకుంటున్న వీడియో.

ఫాక్ట్: పోస్ట్ లోని వీడియో అసలు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించింది కాదు. వీడియోలోని ఘటన వై.ఎస్.జగన్ పుట్టిన రోజు సందర్భంగా జరిగింది కాదు. మహారాష్ట్ర లో శరద్ పవార్ పుట్టిన రోజు సందర్భంగా ఒక ఎన్సీపీ లీడర్ నిర్వహించిన కార్యక్రమంలో జరిగిన ఘటన అది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, వీడియోలోని ఘటన కి సంబంధించి వివిధ వార్తాసంస్థలు ప్రచురించిన ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. అది 12 డిసెంబర్ 2020 న మహారాష్ట్ర లో శరద్ పవార్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్సీపీ లీడర్ ధనంజయ్ ముండే నిర్వహించిన వేడుకల్లో జరిగిన ఘటన అని తెలుస్తుంది. ఆ ఘటన కు సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు.

అంతేకాదు, పోస్ట్ చేసిన వీడియో క్రాప్ చేయబడింది. అసలు వీడియోలో స్టేజీ మీద ఉన్న పోస్టర్ పై శరద్ పవార్ ఫోటో ఉన్నట్టు చూడవొచ్చు. కావున, పోస్ట్ చేసిన వీడియో ఆంధ్రప్రదేశ్ కి గానీ, జగన్ పుట్టిన రోజుకు గానీ సంబంధించింది కాదు.

వీడియోలోని ప్రోగ్రాం కి సంబంధించి ఎన్సీపీ లీడర్ ధనంజయ్ ముండే పోస్ట్ చేసిన ఫోటోలు మరియు లైవ్ వీడియో తన సోషల్ మీడియా అకౌంట్లలో చూడవొచ్చు.

చివరగా, కేక్ కోసం ప్రజలు కొట్టుకుంటున్న ఈ వీడియో జగన్ పుట్టిన రోజు వేడుకలకు సంబంధించింది కాదు. మహారాష్ట్ర లో శరద్ పవార్ పుట్టిన రోజు సందర్భంగా ఒక ఎన్సీపీ లీడర్ నిర్వహించిన ప్రోగ్రాంలో జరిగిన ఘటన అది.

Share.

About Author

Comments are closed.

scroll