చాలామంది ఫేస్బుక్ యూజర్స్ ఒక వీడియో ని పోస్ట్ చేసి పాక్ లోని హిందువుల ఇళ్ల పై ఆ దేశస్థులు దాడి చేసారంటూ అందులో పేర్కొన్నారు. ఇందులో ఎంతవరకు నిజముందో ఓసారి విశ్లేషిద్దాం.
క్లెయిమ్ (దావా): పాక్ లోని హిందువులు తమ ఇళ్ల పై కాషాయం రంగు జెండా ఉంచినందుకు గాను వారిపై ఆ దేశస్థులు దాడి
ఫాక్ట్ (నిజం): పాకిస్థాన్ లోని ఫైసలాబాద్ పట్టణం లో అక్కడి పోలీసులు తమ దేశ మహిళల పై చేసిన దాడికి సంబంధించిన వీడియో అది. కావున హిందువుల ఇళ్ల పై పాకిస్థాన్ దేశస్థులు దాడి చేసారు అనే ఆరోపణలో ఎటువంటి నిజం లేదు.
పోస్ట్ లో ఉన్న వీడియోని ఇన్విడ్ ప్లగిన్ లో సెర్చ్ చెయ్యగా వచ్చిన కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఆ వీడియో పాకిస్థాన్ మీడియా సంస్థ ‘Dunya News’ వారు జూన్ 12, 2013 ప్రచురించిన ఒక కథనం లభించింది. దాని ఆధారంగా, ఫైసలాబాద్ ప్రాంతంలోని ప్రజలు విద్యుత్తు సమస్యకు వ్యతిరేకంగా నిరసన చేసినందుకు గాను అక్కడి పోలీస్ వారు నిరసనకారుల ఇళ్లల్లోకి చొరబడి మహిళలను హింసించారు అని తెలిసింది. ఇది అసలు హిందువుల పై దాడి కాదు.
చివరగా, 2013 లో పాకిస్థాన్ పోలీసులు ఆ దేశ మహిళల పై చేసిన దాడులకు సంబంధించిన వీడియో అది.
2 Comments
May be you are correct
Thank you very much for your acknowledgement. We’re hoping that our other articles are also engaging you enough. We would like to honour your engagement with us. Could you please send your email address to hi@factly.in
Thanks!
Team Factly