భారత్ మరియు న్యూజీలాండ్ మధ్య జరిగిన వరల్డ్ కప్ 2019 సెమీఫైనల్ మ్యాచ్ లో ధోని అవుట్ అయినప్పుడు, అది చుసిన కెమెరామాన్ ఏడ్చేసాడంటూ ఒక లింక్ తో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

క్లెయిమ్ (దావా): వరల్డ్ కప్ మ్యాచ్ లో ధోని అవుట్ అయినప్పుడు ఏడ్చిన కెమెరామాన్.
ఫాక్ట్ (నిజం): ఫోటో లో ఏడుస్తూ కనిపిస్తున్న ఇరాక్ కెమెరామాన్ ఏడ్చింది ధోని అవుట్ అయ్యాక కాదు, తన దేశాపు ఫుట్ బాల్ టీమ్ కతర్ దేశం చేతిలో ఓడిపోయినప్పుడు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.
ఫేస్బుక్ పోస్ట్ లో ఇచ్చిన సాక్షి వార్తాపత్రిక ఆర్టికల్ చూడగా, దాంట్లో “ముఖ్యంగా ధోని అవుటయ్యాక మ్యాచ్ను కవరజే చేస్తున్న ఓ కెమెరామన్ కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కలచివేసింది. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట్లో తెగ హల్చల్చేస్తోంది. ధోని అవుటవ్వడంతో కెమెరా కన్నీరు పెట్టుకుందని కామెంట్ చేస్తున్నారు” అని రాసి ఉంటుంది.
పోస్ట్ లో ఉన్న కెమెరామాన్ ఫోటోని క్రాప్ చేసి గూగల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటోని జనవరి 2019 లోనే చాలా మంది ఇంటర్నెట్ లో పోస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒక టీవీ కరస్పాండెంట్ ఈ ఏడాది జనవరిలో ఈ ఫోటో తన ట్వీట్ లో పెట్టి, ఫోటోలో ఉన్న కెమెరామాన్ పేరు ‘మొహమ్మద్ అల్ అజ్జావి’ అని, తను ‘AFC Asian Cup-2019’ లో తన ఇరాక్ దేశపు ఫుట్ బాల్ టీమ్ ఖతార్ దేశపు ఫుట్ బాల్ టీమ్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయినప్పుడు ఏడ్చాడని రాసాడు. కావున పోస్ట్ లోని కెమెరామాన్ ఫోటోకి క్రికెట్ కి అస్సలు సంబంధం లేదు.
Iraqi sports photographer Mohammed AL Azzawi trying to finish his work through tears after Iraq lost to Qatar in a heartbreaker. To the world soccer is a sport , to Iraqis, it’s everything.. pic.twitter.com/R7ulO5o5NR
— Steven nabil (@thestevennabil) January 24, 2019
చివరగా, ఇరాక్ కెమెరామాన్ ఏడ్చింది తన దేశపు ఫుట్ బాల్ టీమ్ ఓడిపోయినప్పుడు, ధోని అవుట్ అయినప్పుడు కాదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?