BBC సంస్థ ప్రచురించిన అవినీతి రాజకీయ పార్టీల జాబితాలో జగన్మోహన్ రెడ్డి గారి YSRCP ఉంది అంటూ ఫేస్బుక్ లో ఒక పోస్ట్ ని చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయో ఓసారి చూద్దాం.
ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
క్లెయిమ్ (దావా): విఖ్యాత BBC సంస్థ ప్రచురించిన ‘ప్రపంచంలోని అగ్ర 10 అవినీతి రాజకీయ పార్టీలు – 2017’ జాబితాలో జగన్మోహన్ రెడ్డి గారి YSRCP ఉంది.
ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో పెట్టిన జాబితా అసలు BBC వారు ప్రచురించలేదు. BBC News Hub అనే మోసపూరిత వెబ్సైట్ ప్రచురించిన జాబితాని ఫోటోషాప్ చేసి YSRCP ని అందులో చేర్చారు. కావున పోస్ట్ లోని ఆరోపణ అవాస్తవం.
గూగుల్ సెర్చ్ లో “Top 10 corrupt political parties 2017 list” అని వెతికినప్పుడు పోస్ట్ లో పెట్టిన జాబితాని మన దేశం లోని అనేక రాజకీయ పార్టీల కార్యకర్తలు తమ ప్రతిపక్షాల పేర్లను అందులో చేర్చి వాటిపై దుష్ప్రచారం చేసినట్టుగా తెలిసింది. మరింత సమాచారం కోసం వెతికినప్పుడు BBC News Hub ప్రచురించిన జాబితాకి సంబంధించిన ఆర్టికల్ లభించింది.
చివరగా, BBC News Hub అనే మోసపూరిత వెబ్సైట్ ప్రచురించిన జాబితాని ఫోటోషాప్ చేసి YSRCP ని అందులో చేర్చారు.