Fake News, Telugu
 

మణిపూర్ హింస నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి రిపోర్ట్స్ లేవు

0

మణిపూర్ హింసను ఉద్దేశించి మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్పందించినట్టు చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. “మణిపూర్ హింసను భయంకరమైన, క్రురమైనదిగా అమెరికా పేర్కొనడం ఆక్షేపణీయం” అని టెండూల్కర్ అన్నట్టు ఈ పోస్టులో చెప్తున్నారు. అలాగే “మణిపూర్ సమస్య మా దేశ అంతర్గత సమస్య, ఈ విషయంలో ఇతర దేశాల జోక్యం, స్పందనలు అనవసరం” అని కూడా సచిన్ అన్నట్టు చెప్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: “మణిపూర్ సమస్య మా దేశ అంతర్గత సమస్య, ఈ విషయంలో ఇతర దేశాల జోక్యం, స్పందనలు అనవసరం” – సచిన్ టెండూల్కర్

ఫాక్ట్(నిజం): మణిపూర్ హింసకు సంబంధించి సచిన్ టెండూల్కర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి రిపోర్ట్స్ లేవు. అసలు మణిపూర్ హింసను భయంకరమైన/క్రూరమైనది అని అమెరికా ప్రభుత్వం అభిప్రాయపడినట్టు కూడా ఎటువంటి రిపోర్ట్స్ లేవు. ఐతే ఇటీవల ఇద్దరు కూకి తెగకు చెందిన అమ్మాయిలను హింసించిన వీడియో వెలుగులోకి వచ్చిన అనంతరం ఈ ఘటనపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి “ ఇది భారత్ అంతర్గత వ్యవహారం అని, భారత్ కోరితే తమ సహాయం అందిస్తామని” అన్నాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో చెప్తున్నట్టు గతంలో రైతుల నిరసనపై అమెరికా పాప్ స్టార్ రిహన్న వ్యాఖ్యానించిన సమయంలో  ఇది దేశ అంతర్గత వ్యవహారం అని సచిన్ టెండూల్కర్ స్పందించిన మాట నిజమే అయినప్పటికీ ప్రస్తుత మణిపూర్ హింసను ఉద్దేశించి ఇప్పటివరకైతే సచిన్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

ఒక వేళ సచిన్ నిజంగా అలాంటి వ్యాఖ్యలు చేసివుంటే, దేశంలోని అన్ని ప్రముఖ వార్తా సంస్థలు ఈ విషయాన్నీ రిపోర్ట్ చేసేవి. కానీ, ఈ విషయాన్ని ఏ ఒక్క వార్తా సంస్థ అయిన రిపోర్ట్ చేసినట్టు మాకు ఆధారాలు దొరకలేదు.

అసలు మణిపూర్ హింసను భయంకరమైన/క్రూరమైనది అని అమెరికా ప్రభుత్వం అభిప్రాయపడినట్టు కూడా ఎటువంటి రిపోర్ట్స్ లేవు. ఐతే ఇటీవల మణిపూర్‌ హింసకు సంబంధించి ఇద్దరు కూకి తెగకు చెందిన అమ్మాయిలను హింసించిన వీడియో వెలుగులోకి వచ్చిన అనంతరం ఈ ఘటనపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి “ఇది భారత్ అంతర్గత వ్యవహారం అని, భారత్ కోరితే తమ సహాయం అందిస్తామని” అన్నాడు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ).

అంతకు ముందు మణిపూర్ హింస నేపథ్యంలో అక్కడికి ప్రయాణించే తమ దేశీయులకు అమెరికా ప్రభుత్వం ఒక హెచ్చరికను జారీ చేసింది. ఐతే అమెరికా రాయబారి వ్యాఖ్యలపై సచిన్ స్పందించినట్టు ఎటువంటి రిపోర్ట్స్ లేవు.

చివరగా, మణిపూర్ హింస నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి రిపోర్ట్స్ లేవు.

Share.

About Author

Comments are closed.

scroll