Fake News, Telugu
 

దేశవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీలలో చదువుకొని ఐఐటీ, జేఈఈ, నీట్‌, మొదలైన పరీక్షల్లో సీట్లు సాధించిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి

0

ప్రభుత్వ విద్యా విధానాన్ని విమర్శించే క్రమంలో ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీలలో చదివిన విద్యార్థులలో ఒక్కరు కూడా ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు సెలెక్ట్ కావడం లేదని చెప్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా వీడియోలో చెప్తున్న విషయానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీలలో చదివిన విద్యార్థులలో ఒక్కరు కూడా ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు సెలెక్ట్ కావడం లేదు.

ఫాక్ట్(నిజం): దేశవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీలలో చదువుకొని ఐఐటీ, జేఈఈ, నీట్‌, మొదలైన పరీక్షల్లో సీట్లు సాధించిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రభుత్వ విద్యా సంస్థలలో చదివి ఐఐటీ, జేఈఈ, నీట్‌ వంటి పోటీ పరీక్షల్లో సీట్లు సాధించిన ఉదాహరణలు ఉన్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

సాధారణంగా ఐఐటీ, జేఈఈ, నీట్‌ సీట్లు సాధించే వారిలో ప్రైవేటు స్కూళ్ళు, కాలేజీలలో చదువుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీలలో చదువుకున్న విద్యార్థులు ఒక్కరు కూడా ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థలకు సెలెక్ట్ కావడం లేదన్న వాదన కరెక్ట్ కాదు.

దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థలలో చదివి ఐఐటీ, జేఈఈ, నీట్‌ సీట్లు సాధించిన ఘటనలు చాలా ఉన్నాయి. ఉదాహారణకు ప్రభుత్వ సంస్థల్లో చదువుకొని ఇలా ఐఐటీ, జేఈఈ, నీట్‌, మొదలైన సీట్లు సాధించిన వార్తలను రిపోర్ట్ చేసిన కథనాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ప్రభుత్వ విద్యా సంస్థలలో చదివి ఐఐటీ, జేఈఈ, నీట్‌ సీట్లు సాధించిన విద్యార్థులకు సంబంధించి అధికారిక గణాంకాలు లేనప్పటికీ, వార్తా కథనాల ప్రకారం ఈ మధ్య కాలంలో వీరి సంఖ్య పెరిగినట్టు తెలుస్తుంది. గత రెండేళ్లలో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో చదివి పోటీ పరీక్షల్లో సీట్లు సాధించిన విద్యార్థుల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రభుత్వ విద్యా సంస్థలలో చదివి ఐఐటీ, జేఈఈ, నీట్‌ వంటి పోటీ పరీక్షల్లో సీట్లు సాధించిన ఉదాహరణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన వార్తా కథనాలు ఇక్కడ, ఇక్కడ మరియు క్క చూడొచ్చు. ఐతే ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకొని ఐఐటీ, జేఈఈ, మొదలైన వాటిల్లో సీట్లు సాధించిన వారి సంఖ్య ప్రైవేటు విద్యా సంస్థలతో పోలిస్తే తక్కువ ఉండవచ్చు కానీ పోస్టులో షేర్ చేసిన వీడియోలో చెప్తున్నట్టు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకున్న విద్యార్థులు ఒక్కరు కూడా సెలెక్ట్ కాలేదన్న వాదన మాత్రం కరెక్ట్ కాదు.

చివరగా, దేశవ్యాప్తంగా ప్రభుత్వ స్కూల్స్/కాలేజీలలో చదువుకొని ఐఐటీ, జేఈఈ, నీట్‌, మొదలైన పరీక్షల్లో సీట్లు సాధించిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి.

Share.

About Author

Comments are closed.

scroll