Fake News, Telugu
 

‘Yes’ బ్యాంక్ చైర్మన్ రానా కపూర్ 2 కోట్లు పెట్టి కొన్నది ఎం.ఎఫ్.హుస్సేన్ వేసిన పేయింటింగ్ ని

0

‘Yes’ బ్యాంక్ సంక్షోభం ఎదురుకుంటున్న తరుణంలో, ఆ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్ బ్యాంక్ నిధుల నుండి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రియాంకా గాంధీ వేసిన పేయింటింగ్ ని కొన్నాడనే వార్త సోషల్ మీడియా లో చలామణీ అవుతోంది. దాంట్లో ఎంతవరకు నిజముందో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: : ప్రియాంకా గాంధీ వేసిన పేయింటింగ్ ను 2 కోట్ల రూపాయలతో ‘Yes’ బ్యాంక్ ఛైర్మన్ రానా కపూర్ కొన్నాడు.

ఫాక్ట్ (నిజం): ‘Yes’ బ్యాంక్ ఛైర్మన్ రానా కపూర్ కొన్నది ప్రఖ్యాత పేయింటర్ ఎం.ఎఫ్. హుస్సేన్ వేసిన ఒక పేయింటింగ్ ని. రానా కపూర్ ఆ పేయింటింగ్ ని ప్రియాంకా గాంధీ నుండి కొన్నాడు. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు. 

పోస్టులో చెప్పిన విషయం గురించి గూగుల్ లో ‘ Yes Bank chairman 2 crores painting’ అని వెతికినప్పుడు, ‘Economic Times’ వారి కథనం లభించింది. దాని ప్రకారం, ‘Yes’ బ్యాంక్ ఛైర్మన్ రానా కపూర్ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ నుండి ప్రఖ్యాత పేయింటర్ ఎం.ఎఫ్.హుస్సేన్ వేసిన రాజీవ్ గాంధీ పేయింటింగ్ ని 2 కోట్ల రూపాయలతో కొన్నాడు. కావున, రానా కపూర్ 2 కోట్లు పెట్టి కొన్నది ప్రియాంకా గాంధీ వేసిన పేయింటింగ్ ని కాదు, ఎం ఎఫ్ హుస్సేన్ వేసిన పేయింటింగ్ ని. ఇతర వార్తా పత్రికలూ కూడా అదే విషయాన్ని చెప్తూ ప్రచురించిన ఆర్టికల్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఇండియా టుడే ఆర్టికల్ లో ఆ పెయింటింగ్ యొక్క ఫోటోని కూడా చూడవొచ్చు.

చివరగా, ‘Yes’ బ్యాంక్ చైర్మన్ రానా కపూర్ 2 కోట్లు పెట్టి కొన్నది ప్రియాంకా గాంధీ వేసిన పేయింటింగ్ కాదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll