Coronavirus Telugu, Fake News, Telugu
 

ఆక్సిజన్ సిలిండర్ల కోసం 10 కోట్ల రూపాయిల సొంత డబ్బుని ఖర్చు చేయనున్నట్టు వై.యస్.జగన్ ప్రకటించలేదు

0

ఆంధ్రప్రదేశ్ లో ఆక్సిజన్ సిలిండర్ల కొరతని తగ్గించడానికి ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి 10 కోట్ల సొంత డబ్బుని కేటాయించనున్నట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. దేశంలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత వలన మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  ఈ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

 ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత తగ్గించడానికి ముఖ్యమంత్రి వై.యస్.జగన్ 10 కోట్ల సొంత డబ్బు కేటాయించారు.

ఫాక్ట్ (నిజం):  ఆక్సిజన్ సిలిండర్ల కోసం 10 కోట్ల రూపాయల సొంత డబ్బుని ఖర్చు చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ ప్రకటించలేదు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ప్రెస్ రిలీజ్ జారీ చేయలేదు. YSRCP పార్టీ కూడా ఈ విషయాన్నీ తెలుపుతూ ఎటువంటి ట్వీట్ పెట్టలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కి సంబంధించిన వివరాల కోసం గూగుల్ లో వెతికితే, ఆక్సిజన్ సిలిండర్ల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి 10 కోట్ల రూపాయిల సొంత డబ్బుని కేటాయించారని తెలుపుతూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వీడియోలు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. కాని, ఈ వీడియోలలో వై.యస్.జగన్, ఆక్సిజన్ సిలిండర్ల కొరత తగ్గించడానికి 10 కోట్ల సొంత డబ్బుని ఖర్చు చేయనున్నట్టు ఎక్కడా తెలుపలేదు.  ఒకవేళ వై.యస్.జగన్ 10 కోట్ల రూపాయిల సొంత డబ్బులని ఆక్సిజన్ సిలిండర్ల కోసం కేటాయించనున్నట్టు ప్రకటిస్తే, అన్ని ప్రముఖ వార్తా సంస్థలు ఈ విషయాన్నీ రిపోర్ట్ చేస్తూ ఆర్టికల్స్ పబ్లిష్ చేసవి. కాని, ఈ విషయానికి సంబంధించి ఏ ఒక్క న్యూస్ సంస్థ ఆర్టికల్ పబ్లిష్ చేయలేదు.

ఆక్సిజన్ సిలిండర్ల కొరత తగ్గించడానికి 10 కోట్ల రూపాయిల సొంత డబ్బుని ఖర్చు చేస్తున్నట్టు తెలుపుతూ వై.యస్.జగన్ ఎటువంటి ట్వీట్ పెట్టలేదు. ఆక్సిజన్ సిలిండర్లకు సంబంధించి YSCRCP పార్టీ పెట్టిన ట్వీట్ లో కూడా ఈ విషయాన్నీ ఎక్కడా తెలుపలేదు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆక్సిజన్ సిలిండర్లకు సంబంధించి ఇటివల చేసిన ప్రెస్ రిలీజ్ లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత లేదని స్పష్టం చేసింది. ఆక్సిజన్ సిలిండర్ల కోసం వై.యస్. జగన్ 10 కోట్ల రూపాయిల సొంత డబ్బుని ఖర్చు చేయనున్నట్టు ఈ ప్రెస్ రిలీజ్ లో కూడా ఎక్కడా తెలుపలేదు.

చివరగా, ఆక్సిజన్ సిలిండర్ల కోసం 10 కోట్ల రూపాయల సొంత డబ్బుని ఖర్చు చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ ప్రకటించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll