కాశీ శ్రీ విశ్వనాధ్ దేవాలయం పునఃనిర్మాణ పనుల తర్వాత మొదటి సంగ్రహావలోకనం, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: శ్రీ కాశీ విశ్వనాధ్ దేవాలయం పునఃనిర్మాణం తరువాత తీసిన వీడియో.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్నది గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్ దేవాలయం, వారణాసిలోని కాశీ శ్రీ విశ్వనాధ్ దేవాలయం కాదు. ఈ వీడియో 2021 మార్చ్ నెల నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘bharatmotivarass’ పేరుతో ఉన్న ఒక ఇన్‌స్టాగ్రామ్ యూసర్ 11 మార్చ్ 2021 నాడు షేర్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోలో కనిపిస్తున్నది సోమనాథ్ దేవాలయమని ఈ యూసర్ వివరణలో స్పష్టంగా తెలిపారు.
ఈ వీడియోలో కనిపిస్తున్న అదే దేవాలయం యొక్క ఫోటోని ‘The Times of India’ సంస్థ 11 నవంబర్ 2021 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో షేర్ చేసింది. ఈ ఫోటోలో కనిపిస్తున్నది గుజరాత్ రాష్ట్రంలోని శ్రీ సోమనాథ్ మందిరమని ఈ ఆర్టికల్‌లో కూడా రిపోర్ట్ చేసారు. శ్రీ సోమనాథ మందిరంలో దీపావళి పండగ వేడుకకి సంబంధించి దేవాలయ సంస్థ వారు షేర్ చేసిన వీడియోలో, పోస్టులో కనిపించిన అవే దృశ్యాలని మనం చూడవచ్చు.
శ్రీ కాశీ విశ్వనాధ్ కారిడార్ పునఃనిర్మాణ పనులకి సంబంధించి ఇటీవల పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్స్ మరియు వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. శ్రీ కాశీ విశ్వనాధ్ కారిడార్ పనులు చివరిదశలో ఉన్నాయని, 13 డిసెంబర్ 2021 నాడు ప్రధాని నరేంద్ర మోదీ ఈ కారిడార్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపారు.
చివరగా, గుజరాత్ సోమనాథ్ దేవాలయాన్ని చూపిస్తూ శ్రీ కాశీ విశ్వనాధ్ దేవాలయం పునఃనిర్మాణ పనుల తరువాత తీసిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.