Fake News, Telugu
 

యాడ్-ఫిల్మ్ షూటింగ్ దృశ్యాలను ముంబయి మెట్రోరైల్లో చంద్రముఖి ప్రత్యక్షమైందని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

చంద్రముఖి ముంబై మెట్రో రైలులో ప్రత్యక్షమైంది’ అని సినీనటి జ్యోతిక నటించిన చంద్రముఖి సినిమాలోని ఆమె పాత్ర యొక్క వస్త్రధారణలో ఉన్న ఒక అమ్మాయి, మెట్రోరైలులో ప్రయాణికుల్ని ఇబ్బంది పెడుతుందంటూ సోషల్ మీడియాలో కొన్ని దృశ్యాలను షేర్ చేస్తున్నారు. అసలు ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ పోస్టు ద్వారా తెలుసుకుందాం.

ఇదే వీడియోని ఇక్కడ కూడా చూడవొచ్చు.

క్లెయిమ్: చంద్రముఖి వేషంలో ఉన్న ఒక అమ్మాయి ముంబయి మెట్రోరైల్లో ప్రయాణికులకి ఇబ్బంది కలిగించింది.

ఫాక్ట్(నిజం): ఈ వీడియోలోని దృశ్యాలు ఎలక్ట్రానిక్స్ కంపెనీ ‘బోట్’ వారు ఢిల్లీ మెట్రో రైల్లో చిత్రీకరించిన ఒక యాడ్- ఫిలిం షూటింగ్‌కి సంబంధించినవి. Netflixలో స్ట్రీమ్ అవుతున్న కొన్ని టి.వి. సిరీస్ మరియు సినిమాలకి సంబంధించిన కొన్ని పాత్రల వేషంలో ఉన్న నటులు ఈ యాడ్-ఫిలింలో కనిపిస్తారు. వైరల్ అయిన ఈ దృశ్యాలు ‘బోట్ ఎయిర్ డోప్స్’ యొక్క యాడ్ ఫిలిం షూటింగ్‌కి సంబంధించినవి అని నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NMRC) మ్యానేజింగ్ డైరెక్టర్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. కావున, పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

వీడియోకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకొనుటకు, ఈ ఘటన గురించి ఇంటర్నెట్లో వెతకగా, దీనికి సంబంధించిన అనేక మీడియా కథనాలు లభించాయి.

ఈ కథనాల ప్రకారం, మంజులికా (చంద్రముఖి సినిమా హిందీ వెర్షన్ ‘భూల్ భులయ్య’లో చంద్రముఖి పాత్ర పేరు) మరియు స్క్విడ్ గేమ్స్, మనీ హైయెస్ట్ వెబ్ సిరీస్‌లలో పాత్రల వేషాలలో ఉన్న నటీనటులతో ఎలక్ట్రానిక్స్ కంపెనీ ‘బోట్’ వారు ఢిల్లీ మెట్రో రైల్లో ఒక యాడ్- ఫిలిం చిత్రీకరించారు. వైరల్ అవుతున్న ఈ దృశ్యాలు ఆ షూటింగ్‌కి సంబంధించినవే. వైరల్ వీడియోకి సంబంధించిన వార్తా కథనాల్ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. బోట్ కంపెనీ అధికారిక ఇంస్టాగ్రామ్ పేజీలో కూడా ఈ యాడ్ ఉంది.

నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NMRC) మ్యానేజింగ్ డైరెక్టర్ రీతు మహేశ్వరీ ఈ వైరల్ వీడియోపై ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు.  వైరల్ అవుతున్న వీడియో బోట్ కంపెనీ వారి యాడ్- ఫిలిం షూటింగ్ యొక్క దృశ్యాలు అని, NMRC అనుమతితోనే ఈ వీడియోని షూట్ చేశారని తను వెల్లడించారు.

ఈ వీడియోలో చంద్రముఖి/మంజులిక గా నటించిన మహిళ పేరు ప్రియా గుప్తా, చంద్రముఖి వేషంలో తాను ఉన్న కొన్ని చిత్రాలు మరియు వీడియోలను ప్రియా ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, మెట్రో రైలులో బోట్ కంపెనీ చిత్రీకరించిన ఒక యాడ్-ఫిలిం షూట్ యొక్క దృశ్యాలని చంద్రముఖి మెట్రోలో ప్రత్యక్షమైంది అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll