“లాలీపాప్‌తో దొంగ మనసు మార్చిన చిన్నారి! దుకాణంలో దొంగతనానికి వచ్చిన వ్యక్తిని ఒక చిన్నారి అమాయక చర్య పూర్తిగా మార్చింది. చోరీకి ప్రయత్నిస్తున్న దొంగను చూసిన ఆ చిన్నారి తన లాలీపాప్‌ను ఇవ్వడానికి చేయిచాచింది. చిన్నారి నిర్దోషి ప్రేమకు కదిలిపోయిన దొంగ దోచుకున్న డబ్బును వెనక్కి ఇచ్చి, ఆ అమ్మాయిని ముద్దాడి వెళ్లిపోయాడు” అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) ఈ వైరల్ వీడియో ఒక నిజమైన సంఘటనను చూపిస్తున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. పలు తెలుగు మీడియా సంస్థలు కూడా ఇది నిజమైన ఘటనగా రిపోర్ట్ చేశాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: దుకాణంలో దొంగతనానికి వచ్చిన వ్యక్తిని ఒక చిన్నారి అమాయక చర్యతో, దోచుకున్న డబ్బును తిరిగి ఇచ్చి, ఆ అమ్మాయిని ముద్దాడి వెళ్లిపోయిన ఘటనను సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో చూపిస్తున్నది వాస్తవంగా చోటుచేసుకున్న ఘటన కాదు. ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ఈ వీడియోను ‘Kamran Team Official’ అనే యూట్యూబ్ ఛానెల్ 16 నవంబర్ 2025న షేర్ చేసింది. ఈ వీడియో వివరణలో, ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో అని, ఈ వీడియోలో కనిపించే వ్యక్తులు నటులు అని స్పష్టంగా పేర్కొనబడింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను (ఆర్కైవ్డ్) 16 నవంబర్ 2025న, ‘Kamran Team Official (కమ్రాన్ టీం అఫీషియల్)’ అనే పాకిస్థానీ యూట్యూబ్ ఛానెల్ షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. ఈ వీడియో యొక్క వివరణలో, ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో అని, ఈ వీడియోలో కనిపించే వ్యక్తులు నటులని, ఇందులో ఉపయోగించిన ఆయుధాలు నకిలీవని స్పష్టం చేయబడింది. అలాగే, ఇదే వీడియోను 16 నవంబర్ 2025న ‘Kamran Team’ వారి ఫేస్‌బుక్ పేజీలో కూడా షేర్ చేసినట్లు మేము గుర్తించాము. దీన్ని బట్టి, ఈ వీడియోలోని సంఘటన నిజంగా జరగలేదని మనం నిర్ధారించవచ్చు. దీన్ని బట్టి, ఈ వీడియోలోని సంఘటన నిజంగా జరగలేదని మనం నిర్ధారించవచ్చు.

అలాగే, ఈ యూట్యూబ్ ఛానెల్‌లో మనం ఇలాంటి పలు స్క్రిప్టెడ్ వీడియోలను చూడవచ్చు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఇంతకముందు కూడా ఇలాంటి పలు స్క్రిప్టెడ్ వీడియోలు నిజమైన ఘటనలుగా సోషల్ మీడియాలో వైరల్ కాగా, వాటిని ఫాక్ట్–చెక్ చేస్తూ Factly రాసిన కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.
చివరగా, లాలీపాప్‌తో దొంగ మనసు మార్చిన చిన్నారి అంటూ వైరల్ అవుతున్న ఈ వీడియో నిజమైన ఘటనను చూపించడం లేదు, ఇదొక స్క్రిప్టెడ్ వీడియో.

