Fake News, Telugu
 

బంగ్లాదేశ్ కి సంబంధించిన వీడియోలని పశ్చిమ బెంగాల్ లో ముస్లింల అరాచకాలని షేర్ చేస్తున్నారు

0

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జిహదిలు అరాచకం సృష్టిస్తున్న వీడియో, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. మరొక పోస్టులో పశ్చిమ బెంగాల్ ఎన్నికల విధి నిర్వహణకు వెళుతున్న సైన్యాన్ని ముస్లింలు అడ్డుకుంటున్న వీడియో అని షేర్ చేసారు. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టుల యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్లని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ముస్లింల అరాచకాన్ని చూపుతున్న వీడియోలు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలు బంగ్లాదేశ్ కి సంబంధించినవి. మొదటి వీడియో, బంగ్లాదేశ్ కి చెందిన ఛత్రా దళ్ కార్యకర్తలు, హిఫాజత్-ఇ-ఇస్లాం సంస్థ జరిపిన హర్తాళ్కి మద్దతు తెలుపుతూ రోడ్ల పై విధ్వంసాలు సృష్టించిన  ఘటనకు సంబంధించింది. మరొక వీడియో బంగ్లాదేశ్ కి చెందిన ముస్లింలు అక్కడి ఆర్మీ అధికారులని అడ్డుకున్న ఘటనకు సంబంధించినది. ఈ రెండు వీడియోలు పశ్చిమ బెంగాల్ కి సంబంధించినవి కావు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వీడియో-1:

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Bangla News’ ఛానల్  28 మర్చి 2021 నాడు తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. హిఫాజత్-ఇ-ఇస్లాం సంస్థ బంగ్లాదేశ్ వ్యాప్తంగా జరిపిన హర్తాళ్ కి మద్దతు పలుకుతూ అక్కడి ముస్లింలు రోడ్ల పైకి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్న దృశ్యాలని వివరణలో తెలిపారు. ఛత్రా లీగ్ కి చెందిన సభ్యులు హిఫాజత్ హర్తాళ్ కి మద్దతు పలికిన  జుబా దళ్ కార్యకర్తలతో ఘర్షణకు దిగినట్టు ఇందులో తెలిపారు.

ఈ ఘర్షణకు సంబంధించి పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ ఘర్షణలో పోలీసులు కూడా గాయపడినట్టు ఈ ఆర్టికల్స్ రిపోర్ట్ చేసాయి.  ప్రధాని నరేంద్ర మోది బంగ్లాదేశ్ పర్యటనని వ్యతిరేకిస్తూ హిఫాజత్-ఇ-ఇస్లాం సంస్థ, బంగ్లాదేశ్ వ్యాప్తంగా హర్తాళ్ నిర్వహించింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో బంగ్లాదేశ్ కి చెందిందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

వీడియో-2:

ఈ వీడియోలో కనిపిస్తున్న అంబులన్స్ పై అలాగే, ఆర్మీ అధికారులు ధరించిన యునిఫోర్మ్ పై కనిపిస్తున్నది బంగ్లాదేశ్ ఆర్మీ యొక్క అధికారిక చిహ్నం అని తెలిసింది. దీనిబట్టి, ఈ వీడియో బంగ్లాదేశ్ కి చెందినది అని మనం చెప్పవచ్చు.

పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం కొన్ని పదాలు వాడి గూగుల్ లో వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని, బంగ్లాదేశ్ డిఫెన్సె అనలిస్ట్ సంస్థ ‘Defseca.com’ తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఇస్లామిక్ ఉగ్రవాదులు బంగ్లాదేశ్ ఆర్మీ అంబులన్స్ ని అడ్డుకుంటున్న దృశ్యాలని వివరణలో తెలిపారు.  ‘Defseca.com’ సంస్థ ఈ వీడియోని తమ అధికార ఫేస్బుక్ పేజిలో కూడా షేర్ చేసింది. ఈ వివరాల ఆధారంగా వీడియోలోని ఘటన బంగ్లాదేశ్ లో చోటుచేసుకున్నట్టు ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, బంగ్లాదేశ్ కి సంబంధించిన వీడియోలని షేర్ చేస్తూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ముస్లింలు అరాచకాలు సృష్టిస్తున్న ద్రుశ్యాలంటున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll