వీధుల్లో ఉన్న వరద నీటిలో ఒక మొసలిని ఒక వ్యక్తి పట్టుకుంటున్న వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, కర్నూలు జిల్లా మహానందిలో అతి భారీ వర్షం కురవడంతో వీధుల్లో ఒక మొసలి తిరుగాడుతూ కనిపించిందంటూ చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమో పరిశీలిద్దాం.

క్లెయిమ్ : ఒక మొసలి వీధుల్లో ఉన్న వరద నీటిలో తిరుగుతూ కనిపించిన వీడియో కర్నూలు జిల్లా మహానందికి సంబంధించినది.
ఫాక్ట్ (నిజం): వీడియో గుజారాత్ లోని వడోదరా లో భారీ వర్షాలకు వీధుల్లోకి వచ్చిన మొసలిని ‘NDRF’ సిబ్భంది పట్టుకుంటున్నప్పటిది. కావున, పోస్టులో చెప్పింది తప్పు.
పోస్టులో ఉన్న వీడియోని ‘ఇన్విడ్’ ప్లగిన్ లో అప్లోడ్ చేసినపుడు, దానికి సంబంధించిన చాలా కీఫ్రేమ్స్ వచ్చాయి. వాటిని, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అందుకు సంబంధించిన చాలా సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. ఒక సెర్చ్ రిజల్ట్ ద్వారా పోస్టులో పెట్టిన వీడియో యొక్క పూర్తి వీడియో యూట్యూబ్ లో లభించింది. దానిని ‘Gujarat News Live19’ అనే యూట్యూబ్ ఛానల్ గుజరాతీ భాషలో ఒక వ్యాక్యం టైటిల్ గా పెట్టి ఆగష్టు 4, 2019న అప్లోడ్ చేసింది. ఆ వాక్యం తెలుగు అనువాదం- ‘వడోదర నగరంలో భారీ వర్షాల కారణంగా నగరంలోకి మొసలి వచ్చింది’ అని గూగుల్ ట్రాన్సలేటర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంతకు ముందు ఫ్రాగ్మెంటేషన్ చేసినప్పుడు వచ్చిన కీ ఫ్రేమ్స్ ని ‘Vododara floods crocodile’ అనే కీవర్డ్స్ తో మరల రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, పోస్టులో పెట్టిన వీడియో లో కాఫీ రంగు టీ-షర్ట్ వేసుకుని టోపీ పెట్టుకుని మొసలిని పట్టుకుంటున్న వ్యక్తి ఫోటో ‘India Tv’ వార్తా సంస్థ వడోదరలో వర్షాలకు విధుల్లోకి వచ్చిన మొసళ్లను ‘NDRF’ సిబ్భంది పట్టుకోవడం గురించి ఆగస్ట్ 3, 2019న ప్రచురించిన కథనం లో లభించింది.

అదే విషయాన్ని వెల్లడిస్తూ ఇతర వార్తా పత్రికలు ప్రచురించిన కథనాలలో కూడా ఆ వ్యక్తి ఫోటోని చూడవచ్చు. ఆ కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ వర్షా కాలంలో వడోదరలో వన్యప్రాణి సంరక్షణ కార్యకర్తలు మొత్తం 52 మొసళ్లను పట్టుకున్నట్లుగా ‘The Hindu’ వారు ప్రచురించిన ఆర్టికల్ ద్వారా తెలుస్తోంది.
చివరగా, వరద నీటిలో ఒక మొసలి తిరుగాడుతూ కనిపించిన వీడియో ‘మహానంది’ కి సంబంధించినది కాదు. అది గుజారాత్ లోని వడోదరా లో భారీ వర్షాలకు వీధుల్లోకి వచ్చిన మొసలిని ‘NDRF’ సిబ్భంది పట్టుకోవడానికి సంబంధించినది.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: వరద నీటిలో ఒక మొసలి తిరుగుతూ కనిపించిన వీడియో ‘మహానంది’ కి సంబంధించినది కాదు - Fact Checking Tools | Factbase.us