‘కరోనా తో చనిపోయిన మృతదేహాలతో గాంధీ ఆసుపత్రి హైదరాబాద్’, అని చెప్తూ ఒక వీడియోతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కోవిడ్-19 వల్ల చనిపోయిన వారి మృతదేహాలతో నిండిపోయిన హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి వీడియో.
ఫాక్ట్: పోస్ట్ లోని వీడియో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి సంబంధించింది కాదు. వీడియోలో ఉన్నది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పుర్‌లో ఉన్న అంబేద్కర్ ప్రభుత్వ ఆసుపత్రి. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే వీడియోని గత వారం రోజుల్లో చాలా వార్తా సంస్థలు ప్రచురించినట్టు తెలిసింది. అయితే, అది పోస్ట్ లో చెప్పినట్టు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి వీడియో కాదు. వీడియోలో ఉన్నది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పుర్‌లో ఉన్న అంబేద్కర్ ప్రభుత్వ ఆసుపత్రి అని ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు.

రాయ్‌పుర్ అంబేద్కర్ ఆసుపత్రి లో మృతిదేహాల కి సంబంధించి ‘ANI’ సంస్థ వారు 13 ఏప్రిల్ 2021 న పెట్టిన ట్వీట్లను ఇక్కడ చూడవొచ్చు.

తెలంగాణ కి సంబంధించిన కోవిడ్-19 అధికారిక వివరాలు ఇక్కడ చూడవొచ్చు. అధికారిక లెక్కల ప్రకారం 15 ఏప్రిల్ 2020 రోజున (రాత్రి ఎనిమిది గంటల వరకు) తొమ్మిది మంది కోవిడ్-19 ద్వారా చనిపోయారు.

చివరగా, మృతదేహాలతో ఉన్న రాయ్‌పుర్ అంబేద్కర్ ఆసుపత్రి వీడియోని, హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిగా షేర్ చేస్తున్నారు.