Fake News, Telugu
 

‘యూఎస్ కాంగ్రెస్’ సభలో ప్రధాని మోదీని ప్రశంసిస్తున్న వీడియోని బ్రిటిష్ పార్లమెంటులో తీసినదిగా షేర్ చేస్తున్నారు

0

బ్రిటిష్ పార్లమెంట్‌ సభ్యులు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తుండగా స్టాండింగ్ ఓవేషన్ చేస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. బ్రిటిష్ పార్లమెంటులో ఈ గౌరవం అందుకున్న మొట్టమొదటి ప్రధాని నరేంద్ర మోదీ అని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: బ్రిటిష్ పార్లమెంటులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తుండగా సభ్యులు స్టాండింగ్ ఓవేషన్ చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్నది యూఎస్ క్యాపిటల్ భవనంలో, బ్రిటిష్ పార్లమెంటులో కాదు. 2016లో ‘యూఎస్ కాంగ్రెస్’ జాయింట్ సెషన్ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తుండగా, యూఎస్ కాంగ్రెస్ సభ్యులు ఇలా లేచి చప్పట్లు కొట్టారు. 2015లో నరేంద్ర మోదీ బ్రిటిష్ పార్లమెంట్‌ సభలో ఇచ్చిన ప్రసంగానికి కూడా అక్కడి సభ్యులు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. కాని, పోస్టులో షేర్ చేసిన వీడియో బ్రిటిష్ పార్లమెంటుకు సంబంధించింది కాదు. అంతే కాదు, ‘యూఎస్ కాంగ్రెస్’ లో ప్రసంగం చేసిన వారిలో మోదీ మొదటివారు కాదు. ఇంతకు ముందు ఐదుగురు ప్రధానులు కూడా ‘యూఎస్ కాంగ్రెస్’ లో ప్రసంగం చేసి స్టాండింగ్ ఒవేషన్ పొందారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘The Quint’ న్యూస్ సంస్థ 09 జూన్ 2016 నాడు తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ‘యూఎస్ కాంగ్రెస్’ జాయింట్ సెషన్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ సభ్యులు లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్న దృశ్యాలని ఈ వీడియో వివరణలో తెలిపారు. దీన్ని బట్టి, ఈ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్నది వాషింగ్టన్ లోని యూఎస్ క్యాపిటల్ భవనంలో అని తెలిసింది. ఇదే విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ‘Times Now’ న్యూస్ సంస్థ కూడా ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని పబ్లిష్ చేసింది.

‘08 జూన్ 2016’ నాడు యూఎస్ క్యాపిటల్ భవనంలో తాను ఇచ్చిన ప్రసంగం యొక్క వీడియోని, ప్రధాని నరేంద్ర మోదీ తన యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసారు. ఈ ప్రసంగం యొక్క వీడియోలని ‘Rajya Sabha TV’ మరియు ‘AFP’ న్యూస్ సంస్థలు కూడా తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసాయి. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

2015లో బ్రిటన్ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటిష్ పార్లమెంటు సభలో ప్రసంగం ఇచ్చారు. బ్రిటిష్ పార్లమెంటులో నరేంద్ర మోదీ ఇచ్చిన ఈ ప్రసంగానికి అక్కడి సభ్యులు నిలబడి చప్పట్లు కొట్టారు. బ్రిటిష్ పార్లమెంటులో ఈ ఘనత అందుకున్న మొట్టమొదటి భారత ప్రధాని నరేంద్ర మోదీయే అయినప్పటికి, పోస్టులో షేర్ చేసిన వీడియో బ్రిటిష్ పార్లమెంటుకి సంబంధించింది కాదు.

అంతే కాదు, ‘యూఎస్ కాంగ్రెస్’ లో ప్రసంగం చేసిన వారిలో మోదీ మొదటివారు కాదు. ఇంతకు ముందు ఐదుగురు ప్రధానులు కూడా ‘యూఎస్ కాంగ్రెస్’ లో ప్రసంగం చేసి స్టాండింగ్ ఒవేషన్ పొందారు.

చివరగా, ప్రధాని నరేంద్ర మోదీ ‘యూఎస్ కాంగ్రెస్’ సభలో ప్రసంగిస్తుండగా సభ్యులు లేచి చప్పట్లు కొడుతున్న వీడియోని బ్రిటిష్ పార్లమెంటులో తీసినదిగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll