Fake News, Telugu
 

‘హరికేన్ మైఖేల్’ కి సంబంధించిన 2018 వీడియో ని ‘అంపన్’ తుపాను కి సంబంధించినది అని షేర్ చేస్తున్నారు

0

ఇటీవల 20 మే 2020 న పశ్చిమ బెంగాల్ మరియు ఒరిస్సా రాష్ట్రాలలోని సముద్ర తీర ప్రాంతాల పై ‘అంపన్’ తుపాను తీవ్ర ప్రభావం చూపింది. అయితే సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసి పశ్చిమ బెంగాల్ లో వచ్చిన ‘అంపన్’ తుపానుకి సంబంధించింది అని చెబుతున్నారు. కానీ ‘FACTLY’ విశ్లేషణలో అది ఒక పాత వీడియో అని, ఆ వీడియోకి  ‘అంపన్’ తుపాను కి ఏ సంబంధం లేదని తెలిసింది. అదే  వీడియోని ఒక న్యూస్ ఛానల్ వారు, పనామా సిటీ బీచ్ లో ఉన్న ఇళ్ల పై ప్రభావం చూపుతున్న ‘హరికేన్ మైఖేల్’ అనే కథనం కింద అక్టోబర్ 2018న పబ్లిష్ చేసారు. అంతేకాక, వివిధ స్టాక్ వీడియో వెబ్సైట్ లలో కూడా ఆ వీడియో గురించిన వివరణలో ‘హరికేన్ మైఖేల్’ కి సంబంధించినది అని ఉంది. 

సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ 
1. న్యూస్ ఛానల్ వీడియో – https://cbs12.com/news/local/video-shows-hurricane-michael-tearing-home-apart-in-panama-city-beach
2. స్టాక్ వీడియో వెబ్సైట్ – https://www.shutterstock.com/sv/video/clip-1031249690-category-5-hurricane-michael-wind-rips-homes

Did you watch our new video?

Share.

About Author

Comments are closed.

scroll