Fake News, Telugu
 

బంగ్లాదేశ్ కృశక్ లీగ్ సభ్యురాలిపై జరిగిన దాడికి చెందిన దృశ్యాలని షేర్ చేస్తూ ఒక హిందూ మహిళను కొందరు ముస్లింలు అత్యాచారం చేసిన ఘటన అని తప్పుగా క్లెయిమ్ చేస్తున్నారు

0

ముఖం మీద రక్తం కారుతున్న ఉన్న ఒక మహిళను కొందరు పోలీసులు నడిపించుకుంటూ వెళుతున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈమె ఒక హిందూ మహిళ అని, తనకి బంగ్లాదేశ్‌లో ఒక పెద్ద వ్యాపారం ఉంది అని, ఆమెను కొందరు ముస్లింలు ఇటీవల అత్యాచారం చేశారు అని చెప్తూ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. అసలు ఇందులో ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూదాం.

ఈ వీడియో యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: ఈ వీడియోలో కనిపిస్తున్న హిందూ మహిళని కొందరు ముస్లింలు బంగ్లాదేశ్‌లో అత్యాచారం చేసి, తన ఇంటిని స్వాధీనం చేసుకున్నారు.

ఫ్యాక్ట్(నిజం):  ఈ వీడియోలో కనిపిస్తున్న మహిళ పేరు ‘కోహినూర్ అక్తర్.’ ఈమె బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా యొక్క బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీకి చెందిన బంగ్లాదేశ్ కృశక్ లీగ్ యొక్క సభ్యురాలు. ఈవిడ ఇస్లాం మతానికి చెందిన మహిళ. 10 నవంబర్ 2024న ఒక నిరసన కార్యక్రమానికి ఈమె హాజరైనప్పుడు, కొందరు ఆమెపై దాడి చేశారు. వైరల్ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు ఆ సంఘటనకు చెందినవే. ఈవిడపైన అత్యాచారం జరిగింది అని చేస్తున్న క్లెయిమ్‌లో ఎటువంటి నిజం లేదు.  కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

ముందుగా, వైరల్ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, అందులోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికాము. ఈ సెర్చ్ ద్వారా, ఇదే వీడియో ఉన్న ఒక యూట్యూబ్ పోస్ట్ మాకు లభించింది. ఈ వీడియో టైటిల్ ప్రకారం ఇందులో కనిపిస్తున్న మహిళ పేరు కోహినూర్ బేగం, ఈవిడ బంగ్లాదేశ్ కృశక్ లీగ్ సభ్యురాలు. 

తర్వాత, ఈ వివరాలను క్లూగా తీసుకుని ఇంటర్నెట్లో తగిన కీ వర్డ్స్ ఉపయోగించి వెతకగా, ఈ వీడియో మాకు కృశక్ లీగ్ వారి ఫేస్‌బుక్ పేజీలో దొరికింది. ఈ పోస్టు ప్రకారం, వీడియోలో కనిపిస్తున్న మహిళ పేరు కోహినూర్, ఈవిడ బాంగ్లాదేశ్ కృశక్ లీగ్ సభ్యురాలు. 10 నవంబర్ 2024న షహీద్ నూర్ హుస్సేన్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈమె పైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(BNP) వారు దాడి చేశారని ఈ పోస్టులో పేర్కొన్నారు. అలాగే తను అరెస్ట్ కూడా అయ్యారని, దీన్ని వాళ్లు ఖండిస్తున్నట్లు బంగ్లాదేశ్ కృషక్ లీగ్ ఈ పోస్ట్ ద్వారా తెలిపారు.

ఇదే పోస్టులో కోహినూర్ (Kahinur Akther) ఫేస్‌బుక్ అకౌంట్ కూడా వాళ్ళు టాగ్ చేశారు. తన ప్రొఫైల్ చూడగా, వైరల్ వీడియోలో ఉన్న మహిళ, ఈమె ఒక్కరే అని మాకు స్పష్టం అయ్యింది. తన పేజీలో చూస్తే, తను చాలా ఫోటోలలో బుర్ఖా లేదా హిజాబ్ ధరించి ఉండడం మనం స్పష్టంగా చూడవచ్చు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). 

అలాగే ఈమె అప్లోడ్ చేసిన చాలా ఫోటోలలో బంగ్లాదేశ్ కృశక్ లీగ్ యొక్క పోస్టర్లు ఉన్నాయి (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ఈమె అప్లోడ్ చేసిన ఒక ఫొటోలో, తను బంగ్లాదేశ్ కృశక్ లీగ్ యొక్క సభ్యురాలు అని ఒక కార్డు పైన రాసి ఉంది.  ఈ ఆధారాలను బట్టి, తను హిందువు కాదు, ఇస్లాం మతం పాటించే మహిళ అని, అలాగే బంగ్లాదేశ్ కృషక్ లీగ్ సభ్యురాలు అని మనకి స్పష్టం అవుతుంది.

ఈ క్రమంలో మాకు వైరల్ వీడియోలో చూపిస్తున్న సంఘటనని వేరే యాంగిల్ నుంచి తీసిన వీడియో ఒకటి లభించింది. ఇందులో ఆమెని మహిళా పోలీసులు తీసుకొని వెళుతుండగా, కొందరు అరుస్తూ వెంట పడటం మనం చూడవచ్చు. ఈ వీడియో ప్రకారం ఈ సంఘటన ఢాకా నగరంలోని ‘బంగబంధు అవెన్యూ’ అనే ప్రాంతంలో జరిగింది. 

దీని గురించి మరింత సమాచారం కోసం మరోసారి ఇంటర్నెట్లో కీ వర్డ్ సెర్చ్ చేయగా, 10 నవంబర్ 2024న ఢాకాలోని బంగబంధు అవెన్యూలో ఉన్న అవామీ లీగ్ పార్టీ ఆఫీస్ దగ్గర, ఆ పార్టీ కార్యకర్తలు ‘నూర్ హుసేన్ దివస్’’ సందర్భంగా ఒక కార్యక్రమాన్ని (నిరసన ర్యాలీ) నిర్వహించుకున్నారు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ).

ఆ సమయంలో కొందరు BNP పార్టీ కార్యకర్తలు మరియు లీడర్లు అక్కడికి వచ్చిన అవామీ లీగ్ కార్యకర్తలను కొట్టారు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ ). ఈ సందర్భంగా చాలా మంది అవామీ లీగ్ కార్యకర్తలని పోలీసు వారు అరెస్ట్ చేశారు

వార్తా కథనాల ప్రకారం, ఆడవారు మగవారు అని తేడా లేకుండా అందరిని వాళ్లు కొట్టి పోలీసులకు పట్టించారు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ఈ నిరసన కార్యక్రమం నిర్వహించబడిన స్థలంలో ఉన్న షాప్స్, వైరల్ వీడియోలో కనిపిస్తున్న మహిళను పోలీసులు తీసుకెళ్లిన స్థలంలో ఉన్న షాప్స్ ఒక్కటే (ఇక్కడ). 

దీనిబట్టి, బాంగ్లాదేశ్ కృశక్ లీగ్ వాళ్లు తమ ఫేస్‌బుక్ పేజిలో పోస్ట్ చేసిన వైరల్ వీడియోలో ఉన్న ఆమె పేరు కోహినూర్ అక్తర్ అని, తనపై దాడి జరిగింది(ఇక్కడ మరియు ఇక్కడ) అని చెప్పిన సంఘటన, అవామీ లీగ్ వాళ్ళు 10 నవంబర్ 2024న నిర్వహించిన నిరసన ర్యాలీ సమయంలోనే జరిగింది అని మనకి స్పష్టం అవుతుంది. దీన్ని బట్టి వీడియోలో కనిపిస్తున్న మహిళ హిందువు కాదు అని, తనపై అత్యాచారం జరగలేదు అని మనకి స్పష్టం అవుతుంది.

అదనంగా, బాంగ్లాదెశ్‌కి చెందిన ఫ్యాక్ట్ చెక్ సంస్థ ‘రూమర్ స్కానర్’ వారు ఈ వీడియోలో కనిపిస్తున్న మహిళ హిందువు కాదని, వైరల్ పోస్టులో చెప్తున్నట్టు తనపై అత్యాచారం జరగలేదు అని ఒక కథనాన్ని ప్రచురించారు. 10 నవంబర్ 2024న జరిగిన అవామీ లీగ్ ర్యాలీ సందర్భంగా సుమారు 33 మంది నాయకులు మరియు కార్యకర్తలను అరెస్టు చేసినట్లు ఢాకా పోలీసు వారు చెప్పారని, కానీ ఈ సంఘటనలో అత్యాచారం జరిగింది అనడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు అని ‘రూమర్ స్కానర్’ వాళ్ల కథనంలో పేర్కొన్నారు. 

చివరిగా, బంగ్లాదేశ్ అవామీ లీగ్ వారి కృశక్ లీగ్ సభ్యురాలిపై జరిగిన దాడికి చెందిన దృశ్యాలని షేర్ చేస్తూ ఒక హిందూ మహిళను కొందరు ముస్లింలు అత్యాచారం చేసిన ఘటన అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll