Fake News, Telugu
 

ఇటీవల మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియోను కర్ణాటకకు ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు

0

కర్ణాటకలో కార్తీక మాసం సందర్భంగా గుడి ముందు భజన చేస్తున్న హిందువులను కొడుతున్నారు అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. కర్ణాటకలో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచినందుకే ఈరోజు హిందువులకు ఈ పరిస్థితి వచ్చింది అంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్:  కర్ణాటకలో కార్తీక మాసం సందర్భంగా గుడి ముందు భజన చేస్తున్న హిందువులపై ముస్లింలు దాడి  చేసిన వీడియో.

ఫాక్ట్(నిజం):  ఈ వీడియోలోని ఘటన మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో జరిగింది, కర్ణాటకలో కాదు. రాహురి తాలూకాలోని గుహ అనే గ్రామంలో సోమవతి అమావాస్య సందర్భంగా కనీఫ్‌నాథ్ మందిర్ ప్రాంగణంలో ఒక వర్గం వారు లౌడ్ స్పీకర్లు వాడుతూ భజన చేసారు. ఐతే లౌడ్ స్పీకర్ల విషయంలో ఇతర వర్గాల వారు అభ్యంతరం తెలపడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాల ఫిర్యాదుల ఆధారంగా అహ్మద్‌నగర్ పోలీసులు రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లలో సుమారు 124 మందిపై కేసులు నమోదు చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ప్రస్తుతం వైరల్ ఈ వీడియో నిజంగానే హిందూ-ముస్లింల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిందే అయినప్పటికీ ఈ ఘటన జరిగింది కర్ణాటకలో కాదు. ఇటీవల సోమవతి అమావాస్య రోజున మహారాష్ట్రలోని రాహురి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.  ప్రస్తుతం షేర్ అవుతున్న ఈ వీడియో యొక్క స్రీన్‌షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ కథనాల ప్రకారం ఈ ఘటన మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా రాహురి తాలూకాలో రిపోర్ట్ అయ్యింది.

రాహురి తాలూకాలోని గుహ అనే గ్రామంలో సోమవతి అమావాస్య సందర్భంగా కనీఫ్‌నాథ్ మందిర్ ప్రాంగణంలో ఒక వర్గం వారు లౌడ్ స్పీకర్లు వాడుతూ భజన చేసారు. ఐతే లౌడ్ స్పీకర్ల విషయంలో ఇతర వర్గాల వారు అభ్యంతరం తెలపడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాల ఫిర్యాదుల ఆధారంగా అహ్మద్‌నగర్ పోలీసులు రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లలో సుమారు 124 మందిపై కేసులు నమోదు చేశారు.

ఐతే ఈ కనీఫ్‌నాథ్ ఆలయం ప్రాంగణంలోనే దర్గా ఉండడంతో ముందునుండే ఈ వర్గాల మధ్య ఈ భూమిపై యాజమాన్యానికి సంబంధించి వివాదం నడుస్తుంది. ఈ అంశం ప్రస్తుతం స్థానిక కోర్టులో పెండింగ్‌లో ఉంది. రాకేష్ ఓలా, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అహ్మద్‌నగర్ కూడా ఇదే విషయాన్ని నిర్దారించారు.

ఈ ఘర్షణకు సంబంధించి రాహురి పోలీస్ స్టేషన్‌లో రెండు వర్గాలపై నమోదైన FIRలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ ఘర్షణను రిపోర్ట్ చేసిన ఇంకో వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు. వీటన్నిటి బట్టి ఈ వీడియోకు కర్ణాటకకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టంగా అర్ధమవుతుంది.

చివరగా, ఇటీవల మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియోను కర్ణాటకకు ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll