Fake News, Telugu
 

వీడియో గేమ్ దృశ్యాలని చూపిస్తూ ఉక్రెయిన్ క్షిపణులతో రష్యన్ మిలిటరీ ట్యాంకులను ధ్వంసం చేస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

ఉక్రెయిన్ సైనికులు అమెరికన్ FGM-148 జావెలిన్ క్షిపణులతో రష్యన్ మిలిటరీ ట్యాంకులను ధ్వంసం చేస్తున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ద దృశ్యాలంటూ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతరకు నిజముందో చూద్దాం.   

క్లెయిమ్:  ఉక్రెయిన్ సైనికులు అమెరికన్ FGM-148 జావెలిన్ క్షిపణులతో రష్యన్ మిలిటరీ ట్యాంకులను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ పోస్టులో షేర్ చేసినది Arma 3 అనే వీడియో గేమ్ సాఫ్ట్‌వేర్‌ ద్వారా రూపొందించిన ఒక సిములేషన్ వీడియో. ఈ వీడియోలో కనిపిస్తున్నవి నిజమైన యుద్ద దృశ్యాలు కావు. ఈ వీడియోకి రష్యా-ఉక్రెయిన్ మధ్య ప్రస్తుతం జరుగుతున్న యుద్దానికి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ఇటీవల ఒక యూసర్ ట్వీట్ చేస్తూ, ఈ వీడియో Arma 3 గేమింగ్ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి రూపొందించారని, ఈ వీడియో రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్దానికి సంబంధించింది కాదని తెలిపారు.

ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘MILMAN’ అనే యూట్యూబ్ ఛానెల్ 20 జులై 2022 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోని, “Ukraine NLAW Anti-Tank Missile Destroyed 2 Russian Tanks – Arma 3 Game (Military Simultaion)”, అనే టైటిల్‌తో ఈ యూట్యూబ్ ఛానెల్ పబ్లిష్ చేసింది. ఈ వీడియోలో కనిపిస్తున్నవి నిజమైన దృశ్యాలు కావని, ఇది కేవలం Arma 3 అనే వీడియో గేమ్ సాఫ్ట్‌వేర్‌ ద్వారా రూపొంధించిన ఒక సిములేషన్ వీడియో అని వివరణలో స్పష్టంగా పేర్కొన్నారు. Arma 3 అనేది వర్చ్యువల్ రియాలిటీని ఉపయోగించి రూపొందించిన ఒక మిలిటరీ వీడియో గేమ్. ‘MILMAN’ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసిన మరికొన్ని Arma 3 గేమింగ్ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

ఇదివరకు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంతో ఇటువంటి Arma 3 సిములేషన్ వీడియోలని షేర్ చేసినప్పుడు, ఫాక్ట్‌లీ వాటికి సంబంధించి ఫాక్ట్-చెక్ ఆర్టికల్స్ పబ్లిష్ చేసింది. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. 

చివరగా, వీడియో గేమ్ దృశ్యాలని చూపిస్తూ ఉక్రెయిన్ క్షిపణులతో రష్యన్ మిలిటరీ ట్యాంకులను ద్వంసం చేస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.   

Share.

About Author

Comments are closed.

scroll