Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

అది జోర్డాన్ దేశంలో జైలు నుండి విడుదలైనందుకు నిర్వహించిన ఆనందోత్సాహాలలో ప్రమాదవశాత్తు గన్ ఫైరింగ్ లో ఖైదీ చనిపోయిన వీడియో.

0

ఒక వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, పాకిస్తాన్ లో కొరోనాని జయించి ఇంటికి వస్తున్న నాయకుడి కోసం తన కొడుకు ఆనందోత్సాహాలతో గాల్లోకి గన్ ఫైరింగ్ చేయడంతో బులెట్ తగిలి ఆ నాయకుడు చనిపోయాడని చెప్తున్నారు.  అయితే, FACTLY విశ్లేషణ లో ఆ వీడియో పాకిస్తాన్ దేశానికి సంబంధించింది కాదని, అది జోర్డాన్ దేశంలో జరిగిన ఒక ఘటన అని తేలింది. జోర్డాన్ లోని అమ్రావా పట్టణంలో సరి సేలం వార్దాత్ అనే వ్యక్తి జైలు నుండి రిలీజ్ అయ్యి ఇంటికి వస్తుండడంతో, అతని బంధువు ఒకరు ఆనందోత్సాహాలతో గాల్లోకి గన్ ఫైరింగ్ చేసాడు. అప్పుడు పొరపాటుగా ఒక బుల్లెట్ సరి సేలం వార్దాత్ తలకి తగలడంతో అతను చనిపోయాడు. సరి సేలం వార్దాత్ ఒక నేరం కింద ఎనిమిది నెలలుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. కానీ, దేశంలో కోవిడ్-19 ని అరికట్టడానికి ఇటీవల జోర్డాన్ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల అతను శిక్షా కాలం పూర్తి అవ్వడానికంటే రెండు వారాల ముందే విడుదలయ్యాడు.

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. న్యూస్ ఆర్టికల్ – https://www.aljazeera.com/news/2020/04/jordan-man-killed-day-released-prison-200417121506809.html
2. న్యూస్ ఆర్టికల్ – https://noticias.caracoltv.com/coronavirus-covid-19/salio-de-prision-por-emergencia-del-covid-19-y-su-primo-lo-mato-por-error-al-celebrar-su-liberacion-nid226970-ie134

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll