Fake News, Telugu
 

యజీదీ ఎంపీ వియాన్ దఖిల్ ఇంటర్వ్యూ వీడియోను హమాస్ విడుదల చేసిన ఇజ్రాయెల్ మహిళ వీడియోగా షేర్ చేస్తున్నారు

0

ఒక మహిళ తాను హమాస్ ఉగ్రవాదుల చేతిలో ఉన్నప్పటి అనుభవాలు పంచుకుంటున్న వీడియో అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

క్లెయిమ్: ఇది హమాస్ చెర నుండి విముక్తి పొందిన ఇజ్రాయెల్ మహిళ తన అనుభవాలను వివరిస్తున్న వీడియో

ఫాక్ట్(నిజం): వీడియోలో కనిపించిన మహిళ వియాన్ దఖిల్. ఆమె యజీదీ ఇరాకీ పార్లమెంటు సభ్యురాలు. 2017లో ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులు చేసిన దారుణమైన దురాగతాలను వివరిస్తున్న వీడియో ఇది. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు. 

వీడియో గురించి తెలుసుకోవటానికి,  కీ ఫ్రేములను ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా, 2017 నాటి వార్తా కథనాలకు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) దారితీసింది. వీటి ద్వారా వీడియోలోని మహిళ యజీదీ ఇరాకీ MP అయిన వియాన్ దఖిల్‌ అని తెలుసుకున్నాం. 

ఈ ఇంటర్వ్యూలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు యజీదీలపై చాలా దారుణానికి పాల్పడ్డారని, రోజుల తరబడి బందీగా ఉన్న ఒక మహిళ తన బిడ్డను తానే తినేలా మోసగించారని వియాన్ దఖిల్ చెప్పారు. అంతే కాకుండా, ఒక 10 ఏళ్ల బాలికను ఆమె తండ్రి, తోబుట్టువుల ఎదుటే అత్యాచారం చేసి చంపినట్లు దఖిల్ తెలిపారు.

దీని గురించి మరింత పరిశోదించగా, ఇటీవల, హమాస్ ఆరోగ్య  కారణాల వల్ల బందీలుగా ఉన్న ఇద్దరు ఇజ్రాయెలీ మహిళలను విడుదల చేసినట్లు మేము కనుగొన్నాము. వీరి ఇంటర్వ్యూని ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, యజీదీ ఇరాకీ పార్లమెంటు సభ్యురాలు వియాన్ దఖిల్ 2017 ఇంటర్వ్యూ వీడియోను హమాస్ విడుదల చేసిన ఇజ్రాయెల్ మహిళ వీడియోగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll