Fake News, Telugu
 

ఈ వీడియోలో భగవద్గీత గురించి సందేశమిస్తున్నది అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు, న్యూజిలాండ్ ప్రధానమంత్రి కాదు

0

న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డర్న్ శ్రీకృష్ణుని గురించి, భగవద్గీత గురించి ఎంత చక్కటి అవగాహనతో చెప్పారో చుడండి అంటూ పోస్ట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ వీడియోలో ఎంత వరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డర్న్ శ్రీకృష్ణుని గురించి, భగవద్గీత గురించి సందేశమిస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డర్న్ కాదు, అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు తులసి గబ్బార్డ్. జన్మాష్టమి సందర్బంగా శ్రీకృష్ణుని గురించి, భగవద్గీత గురించి సందేశమిస్తు తాను ఈ వీడియో పోస్ట్ చేసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు తులసి గబ్బార్డ్ యూట్యూబ్ ఛానెల్లో ఈ వీడియో దొరికింది. జన్మాష్టమి సందర్బంగా తులసి శ్రీకృష్ణుని గురించి, భగవద్గీత గురించి సందేశమిస్తు ఈ వీడియో పోస్ట్ చేసింది.

ఇదే వీడియోని తులసి గబ్బార్డ్ తన అధికారిక ట్విట్టర్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియో గురించి తెలుపుతూ రాసిన ఆర్టికల్స్ ను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

జన్మాష్టమి సందర్బంగా న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డర్న్ ఏదైనా వీడియో పోస్ట్ చేసారా అని వెతకగా, అలాంటి ఏ వీడియో మాకు లభించలేదు.

చివరగా, అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు తులసి గబ్బార్డ్ పోస్ట్ చేసిన వీడియోని చూపిస్తూ న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డర్న్ శ్రీకృష్ణుని గురించి, భగవద్గీత గురించి సందేశమిస్తున్నట్టు షేర్ చేస్తున్నారు.

Did you watch our new video?

Share.

About Author

Comments are closed.

scroll