Fake News, Telugu
 

UPలో జరిగిన ఘటనకి సంబంధించిన ఫోటోలు చూపిస్తూ అర్ణబ్ గోస్వామిని పోలీసులు కొడుతున్నట్టు తప్పుగా ప్రచారం చేస్తున్నారు

0

జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామిని పోలీసులు హింసిస్తున్నారని చెప్తూ, దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి ని పోలీసులు కొడుతున్న ఫోటో.

ఫాక్ట్(నిజం): ఈ ఫోటోలు జనవరి 2020లో ఉత్తరప్రదేశ్ లోని దియోరియా జిల్లాలో ఫోన్ దొంగలించాడనే నెపంతో అరెస్ట్ అయిన ఒక వ్యక్తిని పోలీసులు స్టేషన్ లో తాడ్లతో కట్టేసి కొట్టిన ఘటనకు సంబంధించినవి. ఈ ఫొటోలకి అర్ణబ్ గోస్వామి అరెస్ట్ కి ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో ఉన్న ఫోటోలని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా అచ్చం ఇలాంటి ఫోటోలు ప్రచురించిన 10 జనవరి 2020 వార్తా కథనం మాకు దొరికింది. ఈ కథనం ప్రకారం ఈ ఫోటోలు ఉత్తరప్రదేశ్ లోని దియోరియా జిల్లాలో ఫోన్ దొంగలించాడనే నెపంతో అరెస్ట్ అయిన ఒక వ్యక్తిని పోలీసులు స్టేషన్ లో తాడ్లతో కట్టేసి కొట్టిన ఘటనకు సంబంధించినవి.

ఈ ఘటనను రిపోర్ట్ చేసిన న్యూస్ వీడియో ఇక్కడ చూడొచ్చు. ఈ న్యూస్ వీడియో కూడా ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగిందని ధృవీకరిస్తుంది. దీన్నిబట్టి ఫోటోలో పోలీసులు కొడుతున్నది అర్ణబ్ గోస్వామిని కాదని కచ్చితంగా చెప్పొచ్చు.

ఒక వ్యక్తి ఆత్మహత్యకి కారణమైన ఆరోపణలతో అర్ణబ్ గోస్వామి అరెస్ట్ అయిన నేపధ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

చివరగా, ఈ ఫోటోలు ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘటనకి సంబంధించినవి, ఈ ఫొటోలకి అర్ణబ్ గోస్వామి కి ఎటువంటి సంబంధం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll