Fake News, Telugu
 

సంబంధం లేని పాత వీడియోని గుజరాత్ రాష్ట్రంలో దసరా పండగ సందర్భంగా మహిళలు కత్తి సాము చేస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

గుజరాత్ రాష్ట్రంలో దసరా నవరాత్రుల సందర్భంగా నెల రోజుల పాటు కత్తి సాము నేర్చుకొని పండగ రోజు ఇలా ప్రదర్శించారు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. వందలాది మహిళలు కత్తి సాము చేస్తూ నృత్యం చేస్తున్న దృశ్యాలని మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోని కేవలం BBC ఛానెల్ పబ్లిష్ చేసిందని, ఈ నృత్య ప్రదర్శనకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పుస్తకంలో స్థానం కూడా లభించిందని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

క్లెయిమ్: గుజరాత్ రాష్ట్రంలో దసరా పండగ సందర్భంగా వందలాది మహిళలు కత్తి సాము చేస్తూ నృత్య ప్రదర్శన చేసిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): గుజరాత్‌లోని 400 ఏళ్ల చరిత్ర ఉన్న రాచరిక సంస్థానమైన రాజ్‌కోట్‌కు మాంధాత సిన్హ్ జడేజాను 17వ రాజుగా పట్టాభిషేకం చేయనున్న సంధర్భంగా రెండు వేలకు పైగా రాజ్‌పూట్‌ మహిళలు కత్తి సాము చేస్తూ ఇలా నృత్య ప్రదర్శన చేశారు. 30 జనవరి 2020 నాడు మాంధాత సిన్హ్ జడేజాకు పట్టాభిషేక వేడుక జరుగనున్న సందర్భంగా 28 జనవరి 2020 నాడు ఈ నృత్య ప్రదర్శన చేశారు. పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది. అంతే కాదు, ఈ నృత్య ప్రదర్శన దసరా పండగ సందర్భంగా చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో షేర్ చేసిన వీడియోపై ‘BBC News Hindi’ వాటర్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుండటానని మనం చూడవచ్చు. ఈ వీడియో కోసం ‘BBC News Hindi’ న్యూస్ ఛానెల్ వెబ్సైట్లో వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘BBC’ న్యూస్ చానెల్  2020 జనవరి నెలలో తమ ఆర్టికల్‌లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. గుజరాత్లోని రాజ్‌కోట్‌ నగరంలో ఈ కత్తి సాము నృత్య ప్రదర్శన జరిగినట్టు ‘BBC’ తమ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసింది. 

గుజరాత్‌లోని 400 ఏళ్ల చరిత్ర ఉన్న రాచరిక సంస్థానమైన రాజ్‌కోట్‌కు రాజ కుటుంబీకుడైన మాంధాత సిన్హ్ జడేజాను 17వ రాజుగా పట్టాభిషేకం చేయనున్న సంధర్భంగా ఈ నృత్య ప్రదర్శన నిర్వహించినట్టు తెలిసింది. రెండు వేలకు పైగా రాజ్‌పూట్‌ మహిళలు కత్తి సాము చేస్తూ ఈ నృత్య ప్రదర్శన చేసినట్టు పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ మరియు వీడియోలను పబ్లిష్ చేశాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. 30 జనవరి 2020 నాడు మాంధాత సిన్హ్ జడేజాకు పట్టాభిషేక వేడుక జరుగనున్న సందర్భంగా 28 జనవరి 2020 నాడు ఈ నృత్య ప్రదర్శన చేశారు. ఈ కత్తి సాము నృత్య ప్రదర్శనకు గిన్నిస్ ప్రపంచ రికార్డు పుస్తకంలోనూ స్థానం సంపాదించుకున్నట్టు తెలిసింది. ఇదే వీడియోని ‘రాయల్ ఫామిలీ అఫ్ రాజ్‌కోట్‌’ సోషల్ మీడియా పేజీలలో కూడా షేర్ చేసారు.

ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది అని, దసరా పండగ సందర్భంగా ఈ నృత్య ప్రదర్శన చేయలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, సంబంధం లేని పాత వీడియోని గుజరాత్ రాష్ట్రంలో దసరా పండగ సందర్భంగా వందలాది మహిళలు కత్తి సాము చేస్తూ నృత్య ప్రదర్శన చేసిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.   

Share.

About Author

Comments are closed.

scroll