Fake News, Telugu
 

సంబంధం లేని పాత వీడియోని రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో సీట్ల కేటాయింపు విషయంపై కాంగ్రెస్ నాయకులు KTRతో చర్చలు జరుపుతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఏ నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయంపై కాంగ్రెస్ నాయకులు KTRతో కలిసి చర్చలు జరుపుతున్న ఇటీవల దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది.  కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క KTRతో  కలిసి భేటీ అయిన దృశ్యాలను మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఏ నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయంపై కాంగ్రెస్ నాయకులు KTRతో కలిసి చర్చలు జరుపుతున్న దృశ్యాలు. 

ఫాక్ట్ (నిజం):  2019లో తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి సహకరించాలని KTR కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలతో చర్చలు జరిపిన దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది, ఇంకా రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియోకి సంబంధించిన వివరాల కోసం కీ పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Mahaa News’ వార్తా సంస్థ 23 ఫిబ్రవరి 2019 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. సిఎల్పీ ఛాంబర్లో KTR ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలతో సమావేశమై డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి సహకరించాలని కొరినట్టు ఈ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.

డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు ఎంపికకు మద్దతు తెలుపాలని KTR సిఎల్పీ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలను కోరితే, వారు దానికి అంగీకారం తెలిపినట్టు ఈ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు ఇతర వార్తా సంస్థలు కూడా ఈ వీడియోను 2019 ఫిబ్రవరి నెలలో పబ్లిష్ చేశాయి. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. పై వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది అని, రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, సంబంధం లేని పాత వీడియోని రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఏ నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయంపై కాంగ్రెస్ నాయకులు KTRతో చర్చలు జరుపుతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll