Fake News, Telugu
 

భారతీయ మహిళలు తమ భర్తలను కొట్టడంలో ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉన్నట్లుగా ఐక్యరాజ్యసమితి ఏ సర్వేను విడుదల చేయలేదు

1

ఐక్యరాజ్యసమితి తమ సర్వేలో భారతీయ మహిళలు వారి భర్తలను కొట్టడంలో ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉన్నారని వెల్లడించినట్లుగా ఉన్న ఒక స్క్రీన్ షాట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. దాంట్లో నిజమెంతుందో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఐక్యరాజ్యసమితి తమ సర్వేలో భారతీయ మహిళలు వారి భర్తలను కొట్టడంలో ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉన్నారని వెల్లడించింది.     

ఫాక్ట్ (నిజం): ఐక్యరాజ్యసమితి అలాంటి సర్వే ఏదీ కూడా ప్రచురించలేదు. కావున, పోస్టులో చెప్పింది తప్పు

పోస్టులోని విషయం గురించి గూగుల్ లో ‘United Nations survey ranks Indian women third in beating their husbands’ అని వెతికినప్పుడు, అలాంటి వార్తనే కొన్ని ప్రముఖ వార్తాసంస్థలు కూడా ప్రచురించినట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. ఇండియా టుడే మరియు డెక్కన్ క్రానికల్ వారు కూడా ఈ విషయం పై ఆర్టికల్స్ ప్రచురించారు.

‘Sada El Balad News’ వారు 18 జూలై, 2016 న మొట్టమొదటిగా ప్రచురించిన ఒక ఆర్టికల్ ఆధారంగా మిగితా అందరు ఈ విషయం పై న్యూస్ ఆర్టికల్స్ రాసినట్టు గమనించవచ్చు. ఆర్టికల్స్ లో ‘UN Crime Statistics’ ఆధారంగా ర్యాంకింగ్లు ఇచ్చినట్టుగా ఉంటుంది. కానీ, ‘UNODC’ వెబ్ సైట్ లో అలాంటి సర్వే గురించి ఎటువంటి సమరాచారం దొరకలేదు. అసలు ఈ విషయం పై ఐక్యరాజ్యసమితి చేసిన సర్వే గురించి న్యూస్ ఆర్టికల్స్ తప్ప వేరే ఎటువంటి అధికారిక సమచారం ఇంటర్నెట్ లో దొరకలేదు. ‘UNODC’ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న నేరాల సంఖ్య, డ్రగ్స్ కేసుల గురుంచి రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంది. దాంట్లో మగ వాళ్ళ మీద హింస మీద ఎటువంటి రిపోర్ట్ రిలీజ్ చెయ్యలేదు.

చివరగా, ఐక్యరాజ్యసమితి భారతీయ మహిళలు తమ భర్తలను కొట్టడంలో ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉన్నట్లుగా ఏ సర్వేను విడుదల చేయలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll